రాష్ట్ర రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షంలో ఉండే పార్టీల నేతలు, అధినేతలు మాట్లాడే మాటలను ప్రజలు గమనిస్తూనే ఉంటారు. నాయకులు చెప్పేదంతా ప్రజలు నమ్ముతారంటే అది కేవలం భ్రమ మాత్రమే. రాష్ట్రంలో వైసీపీ టీడీపీ నేతలను వేధిస్తోందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆయా నేతలపై నమోదైన కేసుల గురించి తప్పనిసరిగా ప్రస్తావించాలి. 
 
ప్రస్తుతం ఏపీలో మూడు కేసుల గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ.ఎస్.ఐ కుంభకోణంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు. ఈ.ఎస్.ఐ స్కామ్ లో అవినీతి జరిగిందా....? లేదా....? తక్కువ ధర మందులను ఎక్కువ ధరకు చెల్లించారా...? లేదా...? అనే ప్రశ్నలకు సమాధానం వెతికితే అవినీతి జరిగిందని సులభంగానే అర్థమవుతుంది. మంత్రి అచ్చెన్నాయుడు అయినప్పుడు అధికారులు సంతకం పెట్టే ఫైళ్లతో వారికి ఆయనకు సంబంధం లేకుండా ఎలా ఉంటుంది. 
 
పోలీసుల సంతకాలు ఫోర్జరీ చేశారని, ఇతర ఆరోపణలతో జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అశోక్ లేలాండ్ స్క్రాప్ అమ్మామని.... వాటిని బస్సులుగా మార్చారని పేర్కొంది. అక్రమ రిజిస్ట్రేషన్లు, నకిలీ ఇన్సూరెన్స్ లు నిజమా....? కాదా...? అనే ప్రశ్నలకు సమాధానం అందరికీ తెలుసు. ఆయనకు కేసులతో సంబంధం ఉన్నట్టు ఆధారాలు కూడా చెప్పటంతో ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పే హక్కు చంద్రబాబుకు లేదు. 
 
మరో టీడీపీ కీలక నేత అయ్యన్నపాత్రుడుపై నిర్భయ కేసు నమోదైంది. మున్సిపల్ కమిషనర్ హోదాలో ఉన్న మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో ఈ కేసు పెట్టారు. అయ్యన్నపాత్రుడు దుర్భాషలాడారా...? లేదా....? అనే ప్రశ్నకు సమాధానాలుగా ఆయనకు సంబంధిన ఆడియో, వీడియో ఫుటేజీలు కూడా ఉండటంతో అరెస్ట్ గురించి ఎటువంటి సందేహాలు అవసరం లేదు. ఆధారాలు ఉండటంతో అరెస్టైన టీడీపీ నేతల గురించి చంద్రబాబు నిరపరాధులని చేస్తున్న వ్యాఖ్యలను విని ప్రజలు నవ్వుతూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: