కరీంనగర్ సమీపంలోని కాకతీయ కాల్వలో ఈ ఏడాది జనవరిలో కారు బోల్తా పడిన ఘటన అప్పట్లో పెను సంచలనమైంది. ఒక్క కారు ప్రమాదం ఎన్నో అనుమానాలు సాక్షాత్తూ ఓ ఎమ్మెల్యే సోదరి కుటుంబం 20రోజులుగా కనిపించకపోయినా ఎవ్వరూ పట్టించుకోకపోవడం మిస్టరీగా మారింది. అర్ధరాత్రిపూట కాలువలో ఒక బైక్ పడిపోతేనే స్థానికులకు శబ్ధం వినిపించి రక్షించే ప్రయత్నంచేస్తే నిజంగానే, అంతపెద్ద కారు ప్రమాదానికి గురై కాలువలో పడిపోతే ఎవ్వరికీ కనీసం చప్పుడు కూడా వినిపించలేదా? అనే అనుమానాలు కలిగాయి.  హత్య అని, ప్రమాదమని, ఆత్మహత్య అని రకరకాల పుకార్లు షికార్లు చేశాయి.

 

మిస్టరీగా మారిన ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు తాజాగా విచారణ అంశాలను వెల్లడించారు. జనవరి 27న జరిగిన ఈ ఘటన ప్రమాదం కాదని, ఆత్మహత్యేనని పేర్కొన్నారు. యితే, సత్యనారాయణరెడ్డి కుటుంబం కనిపించకుండాపోయి ఇరవై రోజులైనా, కుటుంబ సభ‌్యులు గానీ, పనివాళ్లు కానీ, పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదన్నది అనుమానాలకు  తావిచ్చింది. అప్పట్లో ఇది పెద్ద సేన్సేషన్ న్యూస్ గా మారిన విషయం తెలిసిందే.

 

కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే అన్ని టోల్ ప్లాజాలకు సత్యనారాయణరెడ్డి కారు నెంబర్ ఏపీ 15 బీఎన్‌ 3438ను పంపిన పోలీసులు జనవరి 27కి ముందు ఆ తర్వాత ఎప్పుడైనా వచ్చిందో లేదో వివరాలు  పూర్తిగా సేకరించి దర్యాప్తు చేశారు పోలీసులు. సత్యనారాయణరెడ్డి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందన్న విషయం తమ విచారణలో తేలిందని కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఫిబ్రవరిలో ఆయన నిర్వహిస్తున్న ఎరువుల దుకాణంలో ఆత్మహత్య లేఖ, డైరీలు లభించాయని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: