దేశంలో కరోనా వైరస్ ఎంతగా ప్రబలిపోతుందో అందరికీ తెలిసిందే. అయితే కరోనా కట్టడి చేయడానికి వివిధ దేశాల్లో మందులు వ్యాక్సిన్ కనుగొనేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. కొన్ని చోట్ల తాము వ్యాక్సిన్ కనుగొన్నామని.. టెస్టింగ్ లో ఉందని కూడా చెబుతున్నారు.తాజాగా తాము కరోనాకి విరుగుడు కనిపెట్టామని.. తమ పతాంజలి ప్రొడెక్ట్ ద్వారా కరోనిల్ అందిస్తున్నామని.. ఇది కరోనా వైరస్ పెరుగుదలని కట్టడి చేస్తుందని.. మనిషిలో ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుందని చెప్పిన విషయం తెలిసిందే. దాంతో పతంజలి వ్యవహారం ఇప్పుడు దేశంలో చర్చనీయాంశంగా మారింది. కరోనిల్ పేరుతో తీసుకువచ్చిన ఔషధంపై ఎటువంటి వివరాలు లేకుండా కరోనా మందుగా చెప్పుకోవడంపై వివాదం మొదలైంది.

IHG

ఈ క్రమంలోనే మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు కరోనిల్ కోవిడ్‌కు ఔషదమో కాదో తేల్చే వరకు ప్రకటనలు చేయోద్దని కేంద్రం ఆదేశించింది. అంతేకాదు తప్పుడు ప్రచారం చేస్తున్న పతంజలిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కరోనిల్ మందు పై ప్రకటనలు చేయడాన్ని తప్పుబట్టారు. కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో అనుమతి రాకముందే మహారాష్ట్రలో అమ్మాలని చూసినా, ప్రచారం చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

 

మరోవైపు పతంజలి కూడా వివరాలు పంపింది... త్వరలోనే అనుమతులు లభిస్తాయని ధీమాగా ఉంది. కాగా దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ వివరాలు పరిశీలించిన తర్వాతనే అమ్మకాలు చేపట్టాలని ఇటీవల  కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆదేశించిన విషయం తెలిసిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: