తెలంగాణలో కరోనా ఉధృతి బాగా పెరిగిపోతోంది. రోజూ వందల సంఖ్యల్లో కేసులు వస్తున్నాయి. అయితే షాకింగ్ ఏంటంటే.. ఓవైపు కరోనా ఇంతగా ప్రబలిపోతుంటే.. మరోవైపు దాని దాడి కరోనాను కట్టడి చేసే వారిపైనా జోరుగానే ఉంటోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రభుత్వ వైద్యులు, నర్సులు, పోలీసులు, జర్నలిస్టులు దాని బారిన పడుతున్నారు. ఇక ఇప్పుడు జీహెచ్ ఎంసీ ఉద్యోగులు కూడా కరోనా బారిన పడుతున్నారు.

 

 

జీహెచ్ ఎంసీ పరిధిలో కేసుల ఎంతకూ ఆగడం లేదు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. కార్యాలయంలోని బ్యాంకులో క్యాషియర్ గా పనిచేస్తున్న వ్యక్తి వైరస్ బారిన పడ్డారు. ఇప్పటికే కుత్భుల్లాపూర్ పరిధిలో జీహెచ్ ఎంసీలో పనిచేసే వారికి కూడా కరోనా వచ్చినట్టు వార్తలు వచ్చాయి. మరి కీలకమైన వ్యవస్థలనూ ఇలా కరోనా కబళిస్తే.. ముందు ముందు పరిస్థితి ఏంటన్నది హైదరాబాద్ వాసులను వణికిస్తోంది.

 

 

ఇంకా.. అంబర్ పేట నియోజకవర్గ పరిధిలో మరో 13 మందిలో కొవిడ్ నిర్ధరించారు. ముగ్గురు మృత్యువాడ పడినట్లు అధికారులు ధ్రువీకరించారు. మలక్ పేట ఆసుపత్రిలో మరో ఐదుగురికి వైరస్ సోకింది. రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో తొమ్మిది మందికి కరోనా సోకగా తాజాగా మరో ఇద్దరు డాక్టర్లు, నర్సు, ఇద్దరు సిబ్బందికి పాజిటివ్ గా నిర్ధరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో... మూడు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలో ఇద్దరికి, పోచంపల్లి మండలంలో ఒకరికి వ్యాధి సోకింది. జిల్లాలో ఇప్పటివరకు 19కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

 

 

పెద్దపల్లిలో తొలి కరోనా పాజిటివ్ కేసు వెలుగుచూసింది. మహిళకు వైరస్ సోకినట్లు డీఎంహెచ్ ఓ ధ్రువీకరించారు. నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో మరో ఇద్దరు సిబ్బందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ లో ఓ మహిళ కరోనాతో ప్రాణాలు కోల్పోయింది. కాచిగూడ రైల్వే సీనియర్ గార్డు గాంధీ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతూ మృతి చెందారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: