ప్రపంచాన్ని ఒక్క తాటిపై నిల్చిపెట్టిన మహమ్మారి కరోనా..ఈ కరోనా మహమ్మారి ఒక చిన్న వైరస్ లాగా వ్యాపించి ప్రజలను భయ బ్రాతులకు గురిచేసింది.అంతే కాదు దాదాపు లక్షల మంది తమ ప్రాణాలను కోల్పోయారు.అలాంటి కరోనా జనాలకు ఒకరి నుంచి మరొకరికి సోకకుండా కేంద్ర ప్రభుత్వాలు కట్టు దిడ్డమైన చర్యలను అమలు చేస్తూ వస్తుంది. ఇది ఇలా ఉండగా కరోనా ప్రభావం వల్ల మద్య తరగతి జీవితాలు అతలాకుతలం అయ్యాయి.

 

 

జన సాంద్రత కనపడకుండా లాక్ డౌన్ ను విధించి ప్రభుత్వం ప్రజలను ఇళ్లకే పరిమితమయ్యే లా చేశారు. ఇకపోతే ప్రభుత్వ కార్యాలయాలతో ఆర్టీసి మొదలగు అన్నీ సంస్థలను ప్రభుత్వం మూసివేసిన సంగతి తెలిసిందే.. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోయింది.. ఇకపోతే ప్రస్తుతం అన్నీ వాణిజ్య సంస్థలు తెరుచుకున్నాయి. దాంతో పాటుగా ఎపీలో రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా పెరిగింది.అందుకే బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని ఏపి సర్కార్ ఆలోచనలు సారిస్తుంది..

 

 

ఈ మేరకు జూలై నెల నుంచి సేవలను అందుబాటులోకి తీసుకురానుంది..అందుకు సంబంధించిన పనులను ముమ్మరం చేసింది..అందులో భాగంగా ఆంధ్రాలో తిరుగుతున్న ఏ బస్ కైనా నగదు రహిత, కాంటాక్ట్ రహిత టికెటింగ్ విధానాన్ని రూపొందించాలని ఇప్పటికే నిర్ణయించింది..ఆన్ లైన్ టికెట్ రిజర్వేషన్ వ్యవస్థను ఆధునికీకరిస్తున్నామని, అన్ని బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ టికెట్లను జారీ చేయనున్నామని సంబంధిత అధికారులు వెల్లడించారు. 

 

 

 

ఈ వినూత్న సేవలను సమర్థవంతంగా అందించేలా సర్వర్ లను అప్ గ్రేడ్ చేసేందుకు 30వ తేదీ రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ ఆర్టీసీ వెబ్ సైట్ ను నిలిపివేస్తామని, ఆ సమయంలో అన్ని రకాల టికెట్ బుకింగ్, రద్దు సేవలు ఉండబోవని అధికారులు స్పష్టం చేశారు. ఒకేసారి 50 వేల మంది టికెట్లను పొందినా వెబ్ సైట్ పై ఒత్తిడి పడకుండా సేవలను అందిస్తామని తెలిపారు.మొత్తానికి మరో రెండు రోజుల్లో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులన్నీ కూడా రోడ్డెక్కనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: