కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ విధిచడంతో చాల ఆర్థిక నష్టం వాటిల్లింది. ఈ కష్టకాలంలో సొంతింటి కల సాకారం చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? కొత్త ఇల్లు అంటే అంత ఈజీ కాదన్న విషయం అందరికి తెలిసిందే. ఒక్క ఇల్లు కట్టుకోవాలన్నా, కొత్తది కొనుకోవాలన్నా చాలా డబ్బులు అవసరం అవుతాయి.

 

అయితే ఇల్లు కొనడానికి చేతిలో సరిపడినంత డబ్బులు లేవా? అయితే హోమ్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? లోన్ తీసుకొని కొత్త ఇంటిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది అదేంటో చూద్దామా.

 

 

అయితే టాటా క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ తాజాగా కొత్త హోమ్ లోన్ ఆఫర్‌ను ప్రకటించారు. ఉద్యోగం చేస్తున్నవారు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఈ లోన్ స్కీమ్ అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. టైర్ 1, టైర్ 2 సహా ఇతర పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు ఈ హోమ్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చునాని యాజమాన్యం తెలిపారు.

 

 

కస్టమర్లు టాటా క్యాపిటల్ హైసింగ్ ఫైనాన్స్ లోన్ స్కీమ్ కింద రూ.35 లక్షల వరకు రుణం పొందొచ్చునాని తెలియజేశారు. అయితే దీని వడ్డీ రేటు 7.99 శాతం నుంచి ప్రారంభమౌతోందని తెలిపారు. అందుబాటు ధరలోని ఇళ్ల విభాగంలో డిమాండ్‌ను పెంచాలనే లక్ష్యంతో.. ఈమేరకు కొత్త లోన్ స్కీమ్ అందిస్తున్నామని కంపెనీ తెలిపారు.

 

 

అయితే రుణ మొత్తం ప్రాపర్టీ వ్యాల్యూ, మీరు నివాసం ఉంటున్న ప్రాంతం ప్రాతిపదికన మారుతుందని కంపెనీ యాజమాన్యం తెలియజేశారు. లోన్ తీసుకోవాలని భావించే వారు టాటా క్యాపిటల్ వెబ్‌సైట్‌‌కు వెళ్లి రుణ అర్హత ఉందో లేదో చూసుకోవచ్చు. అలాగే రుణానికి సంబంధించి వడ్డీ రేట్లు, ఇతర చార్జీలు, ప్రాసెసింగ్ ఫీజు, ఈఎంఐ డిలే పెనాల్టీ సహా పలు ఇతర అంశాలు కూడా పూర్తిగా తెలుసుకోవచ్చునాని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: