తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. పార్టీ నేతలకు ఇది అగ్ని పరీక్ష సమయంగా మారింది. అచ్చెన్నాయుడు, ప్రభాకర్ రెడ్డి వంటి నేతలు ఇప్పటికే జైలు పాలయ్యారు. మరికొందరు నేతల ఆర్థిక మూలాలపై దెబ్బలు పడుతున్నాయి. మరి సీఎం జగన్ అంత సులభంగా ప్రత్యర్థులను వదలడు కదా.

 

 

జగన్ సర్కారు తాజాగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన ఓ కంపెనీకి పదేళ్ల క్రితం కేటాయించిన భూములను వెనక్కు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం పరిశ్రమలు పెట్టకుండా వందల ఎకరాల భూమిని పెట్టుకున్న గల్లా జయదేవ్ కంపెనీ నుంచి భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 253 ఎకరాలు వాపస్ తీసుకుంది.

 

 

అయితే.. ఇక్కడ ఓ విషయం గమనించాలి.. ఈ చర్య కక్ష పూరితమే కావచ్చు. అందులో పెద్దగా అనుమానాలు అక్కర్లేదు. కానీ.. ఆ చర్య చట్టబద్దంగా ఉందా లేదా.. అన్నదే ముఖ్యం అవుతుంది. తెలుగుదేశం పార్టీ నేతకు చెందిన కంపెనీ అయినంత మాత్రాన అడ్డగోలుగా వ్యవహరిస్తే ప్రభుత్వాలు ఊరుకోవు కదా. ప్రభుత్వాలు భూములు కేటాయించేటప్పుడే కొన్ని రూల్స్ పెడతాయి.

 

 

253 ఎకరాల భూమి గల్లా వారికి ఇచ్చి పదేళ్లైంది. అమరరాజా ఇన్‌ఫ్రా దాన్ని నిబంధన ప్రకారం రెండేళ్లలోగా ఫ్యాక్టరీ పెట్టి 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలి. అవేమీ జరగలేదు. భూమిని సర్కారు వెనక్కు తీసుకుంది. మరి ఆ రూల్స్ పాటించకుండా.. ఏళ్లకు ఏళ్లు భూములను ఆధీనంలో ఉంచుకుంటే.. దానిపై చర్య తీసుకుంటే.. దాన్ని ప్రతిపక్షనేత చంద్రబాబు సమర్థిస్తున్నారు. ఇది కక్ష సాధింపు అంటున్నారు తప్పితే.. చట్టం విరుద్ధం అని మాత్రం అనడం లేదు. మరి ఇలాంటి అక్రమాలను కేవలం సొంత పార్టీ అన్న కారణంతో వెనకేసుకొస్తే అది చంద్రబాబుకే ప్రమాదం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: