ఆనందంగా జీవించాలి.. ఇదే కదా అంతా కోరుకునేది.. రాజయినా.. బంటయినా.. చిరుద్యోగి అయినా.. కంపెనీ సీఈవో అయినా.. అంతా కోరుకునేది ఆనందమే కదా. మరి ఈ ఆనందం ఎక్కడ లభిస్తుంది.. ఎంత ధరకు లభిస్తుంది.. ఏం చేస్తే లభిస్తుంది.. ఈ ప్రశ్నలకు ముందు సమాధానం తెలుసుకుంటే.. ఆనందం అనేది దానంతట అదే మన ముందుకు వస్తుంది.

ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. ఆనందం అనేది ఎక్కడ నుంచో తెచ్చుకునే వస్తువు కాదు.. ఆనందం అన్నది మనలోనే ఉంది.. కాకపోతే మనం దాన్ని గుర్తించాలి. దాన్ని వెలికి తీయాలి.. అంతే.. అసలు మనకు ఆనందం కలిగిస్తున్నది ఏదీ అనేది మనం గుర్తించాలి. దీన్ని గుర్తించడం ఎలా..?
ఆనందాన్ని గుర్తించడం ప్రతి ఒక్కరి వ్యక్తిగత వ్యవహారం.. ఎందుకంటే.. లోకోభిన్నరుచి.. ఒక్కొక్కరికి ఒక్కో విషయం ఆనందం కలిగిస్తుంది.. ప్రపంచంలో ఏ ఇద్దరూ ఒకలా ఆలోచించరని అంటారు. ఇది ఆనందం విషయంలోనూ వర్తిస్తుంది కదా. అందుకే ఇది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిన విషయం.

అందుకే మీకు ఆనందం కలిగించేవి ఏవో ఓ జాబితా తయారు చేసుకోండి. అంటే మిమ్మల్ని మీరు అన్వేషించుకోండి.. ప్రశ్నించుకోండి. మీకు ఆనందం కలిగించేవి.. మీ జీవన చర్యలో భాగం అయ్యేలా చూసుకోండి.. అప్పుడు మీ జీవితం ఆనందమయం అవుతుంది. అంటే.. ఆనందం ఉన్న చోటికి మనం వెళ్ళడం కాదు.. మనమున్న చోటే ఆనందాన్ని సృష్టించుకోవాలన్నమాట .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి