చిత్తూరు జిల్లాకు చెందిన ఓ రైతుకు నటుడు సోనూసూద్ చేసిన సాయం ఇప్పుడు టాక్ ఆప్ ద స్టేట్ అయ్యింది. ఆదివారం ఈ న్యూస్ బాగా వైరల్ అయ్యింది. కుమార్తెలను ఎద్దులుగా పెట్టుకుని ఓ రైతు వ్యవసాయం చేస్తున్న తీరుపై సోనూసూద్ స్పందించారు. సాయం చేస్తానని ట్వీట్ చేసిన గంటల్లోనే ఆ రైతు ఇంటి ముందు కొత్త ట్రాక్టర్ ఉంచారు. 

 

 

IHG


సోనూసూద్‌ ఉదారత, స్పీడు చూసి తెలుగు జనం ఆశ్చర్యపోయారు. నాయకులు సైతం షాకయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు సోనూసూద్‌కు ఫోన్ చేసి అభినందించారు. తాను కూడా ఆ రైతు పిల్లను చదివించే బాధ్యత తీసుకుంటానన్నారు. ఆ తర్వాత ఆ విషయాన్ని చంద్రబాబు ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. 

 


ఆ తర్వాత సోనూ సూద్‌ చంద్రబాబు ట్వీట్ పై స్పందించారు. ట్వీట్ లో సోనూ సూద్ ఏమన్నారంటే.. " మీ అభినందనపూర్వక మాటలకు ధన్యవాదాలు సర్.. సహాయంలో ఉన్నవారిని ఆదుకునేందు...  మీ దయాగుణమే మాలాంటి వారికి స్ఫూర్తి.. మీ మార్గదర్శకత్వంలో లక్షల మంది తమ కలలు నిజం చేసుకున్నారు. మీరు ఇలాగే స్ఫూర్తినిస్తూ ఉండండి.. త్వరలోనే మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను..అంటూ పోస్టు చేశారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: