ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు భారీగా కేసులు పెరిగిపోతున్నప్పటికీ  రికవరీ రేటు ఎక్కువగా ఉండటంతో ప్రజలు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అయితే కరోనా  వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న పేషెంట్లకు వైద్యులు వరెమ్ డెసివర్  మందు కొవిఫర్ వాడాలి  అంటూ ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎంతోమంది హెటిరో  కంపెనీ ఆధ్వర్యంలో మార్కెట్లోకి వచ్చిన కోవిఫర్  మందును  వాడుతున్నారు. మామూలుగా ఈ మందు వ్యాక్సిన్ రూపంలో ఉంటుంది. కాగా ప్రస్తుతం వైద్యులు ఎక్కువ మొత్తంలో ఈ మందును వాడాలని సూచిస్తున్న  నేపథ్యంలో దీనికి  ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో బ్లాక్ మార్కెట్ దందా కూడా మొదలైంది. మామూలుగా ఏదైనా వస్తువుకి డిమాండ్ ఎక్కువగా ఏర్పడిందంటే దానికి బ్లాక్ మార్కెట్ ద్వారా భారీగా డబ్బులు దండుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


ప్రస్తుతం ఈ కరోనా మందు కొవిఫర్  విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. సాధారణంగా కంపెనీ ఈ వ్యాక్సిన్ కోసం నిర్ణయించిన ధర 5 వేల 400 రూపాయలు మాత్రమే. కానీ ప్రస్తుతం ఈ మందును బ్లాక్ మార్కెట్కు తరలించి ఒక్క బాటిల్ ధర 30 వేల వరకు అమ్ముతున్నారు. దీంతో కొంతమంది చేసేదేమీ లేక భారీగా డబ్బులు చెల్లించి మరి కొవిఫర్ మందు కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హెటిరో  కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దాదాపుగా ఈ మందు  ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా చూసుకుంటున్న హెట్రో కంపెనీ... ప్రస్తుతం బ్లాక్ మార్కెట్ నుంచి ప్రజలకు కాస్త విముక్తి కల్పించాలని నిర్ణయించింది.



ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకుంది హెటెరో  కంపెనీ. హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి లోని వై జంక్షన్ దగ్గర హెటేరో కు  సంబంధించి ఒక ప్రత్యేక కౌంటర్ తెరిచింది. అక్కడ అన్ని వేళలా కోవిఫర్ అందుబాటులో ఉంటుందని... కావలసినవారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో మందును  కొనుగోలు చేయవచ్చు అంటూ సూచించింది.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: