అప్పటికే నడవలేని పరిస్థితి కూడా వచ్చింది అరియనా. కాళ్లు మొత్తం చచ్చు పడిపోయాయి.. ఇక ఆ తరువాత కొద్దిరోజులకే మతిస్థిమితం లేని వారిలా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం మొదలు పెట్టింది. ఇక వైద్యులకు అసలు విషయం అర్థమైంది... యువతికి కిస్సింగ్ డిసీస్ సోకింది అని నిర్ధారించారు వైద్యులు. దాని వల్లే ఆమె మెదడు వాచిపోయి కాళ్ళు పనిచేయడం ఆగిపోయాయి అంటూ తెలిపి అందరికీ షాక్ ఇచ్చారు. ఇది ముందుగానే గ్రహించి చికిత్స అందించి ఉంటే మాత్రం బతికే అవకాశాలు ఉండేవని వైద్యులు తెలిపారు.
ఇంతకీ ఏమిటీ కిస్సింగ్ డిసీస్ అనే కదా మీ డౌట్.. మామూలుగా కొంతమంది వ్యక్తుల నుంచి లాలాజలం ఎక్కువగా వస్తుందట.. అధర చుంబనం చేసే వారికి లాలాజలం మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటం కారణంగా ఇలా మెదడు వాచిపోయి..కాళ్ళు చచ్చుబడి పోయి.. ప్రాణాలు కూడా పోతాయట. ఈ వ్యాధినే మోనో అని కూడా పిలుస్తారు. ఇక ప్రస్తుతం ఈ యువతి లో అలాంటి లక్షణాలు కనిపించడంతో... యువతి కూడా కిస్సింగ్ డిసీస్ కారణంగానే ప్రాణాలు కోల్పోయింది అని వైద్యులు నిర్ధారించారు. అయితే ఇది చాలా అరుదుగా వస్తూ ఉంటుందని వైద్యులు తెలిపారు. ఇక తమ కూతురు చనిపోయిందని తెలిసిన తల్లిదండ్రులు ఓ నిర్ణయం తీసుకున్నారు. తమ కూతురు ఈ లోకంలో లేకపోయినా అవయవదానం ద్వారా ఇతరులకు ప్రాణం పోయాలని నిర్ణయించుకొని తమ కూతురు అవయవాలను దానం చేసేందుకు ఒప్పుకున్నారు.
Powered by Froala Editor
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి