దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. మహమ్మారి బారినపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కారణంగా నా అనుకున్న బందువులు సైతం కొడుక్కు కరోనా ఉందన్న అనుమానంతో అంత్యక్రియలకు ముఖం చాటేశారు. ఈ కరోనా మానవ సంబంధాలను, మమతానురాగాలను తెంచటమే కాదు రక్త సంబంధికుల మధ్య ఎంత బలంగా ఉన్నాయో కూడా చూపించిన ఘటన ఇది.
కొడుకు అంటే పున్నామ నరకం నుండి కాపాడేవాడు అంటారు. కానీ ఈ తండ్రికి వచ్చిన పరిస్థితి ఎవరికీ రాకూడదు. కానీ ఇలాంటి సంఘటన మంచిర్యాల జిల్లాలో ఓ తండ్రికి ఎదురైంది. కానీ, కొడుకులు మాత్రం కన్నతండ్రికి మెరుగైన వైద్యం అందించడానికి కూడా ముందుకు రాలేదు. తల్లి ప్రేమకు సాటి వచ్చేది ఈ ప్రపంచంలో మరేదీ లేదని నల్గొండ మాతృమూర్తి నిరూపించగా.. తల్లిదండ్రుల పట్ల అందరికి కాకపోయినా కొందరికైనా పరిధులు ఉంటాయని మంచిర్యాల ఘటన నిరూపించింది. వివరాల్లోకి వెళ్తే...
అయితే మంచిర్యాలకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఓ వ్యక్తి సాయంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అతనిని పరీక్షించిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ కు తరలించాలని తెలిపారు. ఈ విషయమై అతడి కొడుకులకు సమాచారం అందించారు.
అయితే నాన్న ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడంటే కొడుకులు వెంటనే పరిగెత్తుకొని వస్తారని ఎవరైనా భావిస్తారని తెలిపారు. కానీ కరోనా భయంతో ఇద్దరు కుమారులు అటువైపు రాలేదు. దీంతో వైద్య సిబ్బంది అదే రోజు సాయంత్రం బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. అక్కడ కరోనా టెస్టులు చేయగా.. పాజిటివ్ అని తేలింది. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆయన ప్రాణాలు కోల్పోయారని తెలియజేశారు. సోమవారం ఉదయం పోలీసులు మృతుడి కుమారులతో మాట్లాడారు. దీంతో అక్కడికి చేరుకున్న వారు. తండ్రి మృతదేహాన్ని తీసుకెళ్లి కరోనా నిబంధనల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారని
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి