ఏపీలోని ప్రకాశం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కోటి ఆశలతో అత్తారింట్లో అడుగు పెట్టిన కొత్త పెళ్లి కూతురుకు నాలుగు రోజుల్లోనే కోలుకోలేని షాక్ తగిలింది. ఎన్నో ఊహలతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన నవ వధువు ఆశలన్నీ అడియాశలయ్యాయి. వరుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో ఎవరికీ తెలియదు. వరుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడటంతో రెండు కుటుంబాల్లో తీరని విషాదం మిగిలింది.
నిన్న జరిగిన ఈ ఘటన వల్ల వరుడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలలోకి వెళితే ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పుట్టచెరువుపాలేనికి యువకుడికి నాలుగు రోజుల క్రితం జరుగుమల్లి మండలం పమిడిపాడుకు చెందిన యువతితో ఘనంగా వివాహం జరిగింది. ఇంజనీరింగ్ చదివిన వరుడు ఉద్యోగం కోసం ప్రయత్నించినా అర్హతకు తగిన ఉద్యోగం దక్కలేదు.
ఉద్యోగం రాకపోవడంతో కొంతకాలంగా గ్రామంలోనే పొలం పనులు చేసుకుంటూ యువకుడు చిట్టీలు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నిన్న ఉదయం యువకుడు గ్రామంలోని సుబాబుల్ తోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పశువులు కాసే యువకులు యువకుడి మృతదేహాన్ని చూసి సమీపంలోని పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.
అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి సోదరుడు యువకుడి మృతిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు గురించి దర్యాప్తు చేపట్టారు. పెళ్లైన నాలుగు రోజులకే వరుడు మృతి చెందడంతో ఇరు కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. వరుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటన గురించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఉద్యోగం రాకపోవడం వల్లే యువకుడు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి