మీ ఆదాయంని మీరు మరెంత పెంచుకోవాలని అనుకుంటున్నారా..? సులువుగా మీరు ఇప్పడు ఈ స్కీం తో మీ ఆదాయంని పెంచుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ మీకు ఇప్పుడు అదిరిపోయే ఆప్షన్ అందుబాటు లోకి తీసుకు రావడం జరిగింది. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ని ఒకటి ప్రవేశ పెట్టడం జరిగింది. దీని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే..? ప్రతి నెలా చేతికి డబ్బులు తప్పకుండ వస్తాయి. ఒకసారి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే చాలు.
ఆ తర్వాత నుండి ప్రతి నెలా రెగ్యులర్‌గా ఆదాయం మీరు పొందవచ్చు. చాలా మంది ఒకసారి ఇన్వెస్ట్ చేసాక ప్రతీ నెల ఆదాయం పొందాలని అనుకుంటూ ఉంటారు. మీరు కూడా అలానే అనుకుంటే ఈ స్కీం మీకు పర్ఫెక్ట్. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ జాయింట్ అకౌంట్‌కు రూ.9 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే మీరు కనుక సింగిల్ అకౌంట్ తో ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటే రూ.4.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది.
మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ పై 6.6 శాతం వడ్డీ లభిస్తుంది. రూ.4.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరానికి రూ.29,700 పొందొచ్చు. అదే రూ.9 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ.60,000 వరకు వస్తాయి. దీని ప్రకారం మీకు నెలకు దాదాపు రూ.5,000 లభించవచ్చు. ఎకౌంట్ ఓపెన్ చెయ్యడానికి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు ఉంటే చాలు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి