దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రతిరోజూ 60,000కు పైగా నమోదవుతున్న కేసులు ప్రజలు రోడ్లపై అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితిని తీసుకొచ్చాయి. మరికొన్ని రోజుల్లో రోజుకు లక్ష కేసులు నమోదైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే మార్గమని వైద్యులు సూచిస్తున్నారు.
 
రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా వైరస్ సోకే అవకాశాలు తగ్గుతాయని... ఒకవేళ వైరస్ సోకినా త్వరగా కోలుకునే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచే ఇమ్యూనిటీ బూస్టర్లను ఇప్పటికే పలు కంపెనీలు మార్కెట్లోకి తీసుకొచ్చాయి. పతాంజలి సహా పలు కంపెనీలు తీసుకొచ్చిన ఇమ్యూనిటీ బుస్టర్లకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. తాజాగా కర్ణాటక మంగళూరుకు చెందిన ప్రముఖ ఆయుర్వేద ఉత్పత్తుల రీటైలర్ వివేక్ ట్రేడర్స్ ఆయుష్ చిక్కీ పేరుతో ఇమ్యునిటీ బూస్టర్ ను ఆవిష్కరించింది.
 
తులసి, అల్లంతో పాటు పలు మిశ్రమాలతో తయారు చేసిన ఆయుష్ చిక్కీ కరోనా రాకుండా అడ్డుకోగలదని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. వివేక్ ట్రేడర్స్ ఇప్పటికే మంగళూరులో ఆయుష్ చిక్కీని అందుబాటులోకి తెచ్చింది. ఆయుష్ చిక్కీ వెల కేవలం 20 రూపాయలే కావడం గమనార్హం. చాలామంది ఈ ఇమ్యూనిటీ బూస్టర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని సంస్థ తెలిపింది.
 
ప్రజలు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. వైద్యులు కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. మొక్కజొన్న, స్వీట్ కార్న్, ఆకుకూరలు, పాలు, పెరుగు, పప్పు దినుసులు, బీన్స్, చిక్కుళ్లు, రాజ్మా, సోయా, కాబూలీ శనగల్, వేరుశనగ, పుట్టగొడుగు గుడ్లు, పళ్లు, స్కిన్ లెస్ చికెన్, చేపలు ఆహారంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం, వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే మన ముందు ఉన్న ఆప్షన్లు అని వైద్యులు చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: