ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో తనగురించి ఎవరెవరో చేస్తున్న వ్యాఖ్యలు కూడా తమ పార్టీనే చేయిస్తుందంటూ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని దుయ్యబట్టారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన గుర్రంపాటి దేవేందర్ రెడ్డి పైన చర్యలు తీసుకోండి అంటూ ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ న్యాయమూర్తులపై చేస్తున్న వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఏవిధంగా రాయాలి ఏమి రాయాలి అనే విషయాలు కూడా సోషల్ మీడియా ఇంచార్జి అయినా గుర్రంపాటి దేవేందర్ రెడ్డి చెబుతున్నారంటూ ఎద్దేవా చేసారు. ఏదైనా సరే సోషల్ మీడియాలో వీరిని నిందించిన వారిలో 80% రెడ్లు కులానికి చెందినవారే ఉన్నారంటూ గంటాపధంగా చెబుతున్నారు. నాకు రెడ్లంటే చాలా గౌరవమని అందుకే నా మనవడికి కూడా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అని పేరు పెట్టాను అన్నారు. ఇలాంటి కొద్ది మంది పిచ్చివాళ్ల వలన ప్రభుత్వానికి అప్రతిష్ట మరియు కులానికి అప్రతిష్ట.
ప్రజాస్వామ్యంలో మీ బొమ్మతో గెలిచినా కూడా నాకు కూడా విలువుంది కాబట్టే గెలిచాను. దయచేసి నన్ను విలువలేని వారిలాగా చూడకండి. మీకు ఇష్టం లేకపోతే నన్ను పార్టీ నుంచి పంపేయండి. మీరంటే నాకిష్టం నేనంటే మీకిష్టం ఇటువంటి కులానికి మచ్చ తెచ్చేవారిని పనికిమాలిన అధికారిని దయచేసి సస్పెండ్ చేయండి. అమరావతి రైతులు అసలే కరోనాతో గుండె ఆగి మరణాలు కూడా జరుగుతున్నాయి. నేను రైతులకు ఒకటే చెబుతున్నా రాజ్యాంగం మీకు అనుకూలంగా ఉంది. దేవుడు కూడా మనకు అనుకూలంగా ఉన్నాడు. కొంతమంది నాయకులు మాత్రమే మనకు ప్రతికూలంగా ఉన్నారు. నేను వేరే పార్టీ తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నాను అనేవారికి, అటువంటి పిచ్చి ప్రేలాపన చేసేవారికి చెబుతున్నా. నా స్వస్థలం బెజవాడ దీని గురించి మాట్లాడే హక్కు నాకుంది. ఎవరూ నన్ను ప్రశ్నించే హక్కు లేదు. అని సోషల్ మీడియాలో నాపై ఘాటుగా మాట్లాడే రావు గారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దయచేసి ఒక మంచి పనికి ఎవరు వచ్చినా స్వాగతించండి. అమరావతిని కాపాడుకోవడం అందరి బాధ్యత నాకు ఒక భాగం ఎక్కువ ఉంటుంది. నేను డీజీపీకి పర్మిషన్ పెట్టి, ఆ ఏరియా కి వచ్చి అందరినీ కలుస్తాను. అన్ని సమస్యలను అడిగి తెలుసుకుంటాను.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి