దేశ ప్రయోజనాల కోసం తమ మధ్య పొత్తు కుదిరిందని టిడిపి, బిజెపి పార్టీల అగ్రనేతలు ఢంకా కొట్టి చెబుతున్నా ఆయా పార్టీలలోని క్షేత్ర స్థాయి పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. తెలంగాణలో బిజెపితో పొత్తు అవసరం అని టిడిపి నేతలు వెంపర్లాడితే, సీమాంధ్రలో మాత్రం పరిస్థితి కాస్తా భిన్నంగా కనిపిస్తోంది. పొత్తు వరకు ఒకే తమతో కలసి ప్రచారం చేసి బిజెపి పార్టీ ఇచ్చే బహిరంగ మద్దతు తమకు వద్దని సీమాంధ్ర ప్రాంత తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. సీమాంధ్రలో బిజెపికి ఉన్న నామ మాత్రపు బలం తమకు ఏమాత్రం ఉపయోగపడదని, కానీ ఆ పార్టీతో కలసి ప్రచార రంగంలోకి దూసుకెళ్లడం ద్వారా మైనార్టీ ఓట్లు తమకు దూరం అవుతాయని సీమాంధ్రలోని పలు నియోజకవర్గాలలో టిడిపి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
మైనార్టీలు అధికారంగా ఉన్న చోట్ల బిజెపితో కలసి వెళ్లడం తమకు నష్టంగా టిడిపి అభ్యర్థులు భావిస్తున్నట్లు సమాచారం. అంతర్గత మద్దతు చాలు...? బిజెపితో జతకట్టే విషయంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో ఏమీ చెప్పలేని టిడిపి అభ్యర్థులు ప్రచారం విషయంలో మాత్రం తమ మనోభిష్టంకు అనుగుణంగా వెళ్తున్నారు. రాయలసీమ, ఆంధ్రాలోని గుంటూరు, విజయవాడ, నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాలలో మైనార్టీ ఓట్లు గణనీయంగా ఉన్నాయి. ఈ ప్రాంతాలలోని కొన్ని నియోజకవర్గాలలో ముస్లిం ఓటర్లే గెలుపును నిర్ణయించే శక్తిగా ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గాలలో పోటీలో ఉన్న టిడిపి అభ్యర్థులు బిజెపితో పొత్తు విషయంలో ఆందోళన చెందుతున్నారు. ఎలాగూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు బిజెపితో జతకట్టడంతో ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్న ఈ తెలుగు తమ్ముళ్లు ఆ పొత్తు ప్రభావం తమ గెలుపుపై పడకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఎన్నికల నామినేషన్లలో ఈ రెండు పార్టీల నేతలు కలసి పనిచేసినా ప్రచారం చేసే సమయంలో మాత్రం బిజెపి అవసరంలేదంటూ టిడిపి అభ్యర్థులు స్పష్టంచేస్తున్నట్లు తెలుస్తోంది
బిజెపితో పొత్తు వల్ల తామ విజయావకావాలు ఏ మాత్రం మెరుగుపడతాయో గానీ ఆ పార్టీతో పొత్తు వల్ల వచ్చే మైనార్టీ ఓట్లు తమకు దూరం అవుతాయని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ కారణం చేత తాము ప్రచారానికి వస్తామని బిజెపి నేతలు చెప్పినా వద్దు బాబు, అంతర్గతంగా మీ ఓట్లు పడేట్లు చూడండి అని టిడిపి అభ్యర్థులు కోరుతున్నట్లు తెలుస్తోంది. నంద్యాల, బనగానపల్లే, ఆళ్లగడ్డ, గుంటూరు, నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో ఇలాంటి విజ్ఞాపనలు కొందరు నేరుగానూ మరి కొందరూ బిజెపి స్నేహాస్తానికి సహాయ నికారణ చేస్తూ తమ మనోగతాన్ని బయటపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా టిడిపి, బిజెపికి మధ్య కుదిరిన పొత్తుతో తెలుగుదేశం అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది. తొలుత కాంగ్రెస్ పార్టీలో ఓడి మైనార్టీ ఓట్లతో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు రాష్ట్ర విభజన నేపథ్యంలో కొందరు టిడిపిలో చేరారు. ఇలాంటి నేతలు ఎక్కువగా బిజెపితో కలసి ప్రచారం నిర్వహించేందుకు సుముఖతను వ్యక్తంచేయడంలేదని సమాచారం.
మరింత సమాచారం తెలుసుకోండి: