అమెరికాకు చెందిన ఒక ఫార్మా కంపెనీ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ ఆయింట్‌మెంట్ కు అమెరికా ఎఫ్డీఏ ఆమోదం కూడా లభించిందని తెలిపింది. ఎవరైనా ఈ ఆయింట్‌మెంట్ ను సొంతంగా వాడుకోవచ్చని... దీనిని కొనుగోలు చేయడానికి మందుల చీటీ అవసరం లేదని ఫార్మా నిపుణులు చెబుతున్నారు. ఈ ఆయింట్‌మెంట్ తో చికిత్స చేసిన 30 సెకన్ల తరువాత వైరస్ కనిపించడం లేదని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది.
ఈ ఆయింట్‌మెంట్ సహాయంలో ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించే కరోనా వైరస్ ను సులభంగా అడ్డుకోవడం సాధ్యమవుతుందని నిపుణులు తెలుపుతున్నారు. కరోనా వైరస్ నుంచి రక్షణ కోసమే ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో ఈ ఆయింట్‌మెంట్ గొప్ప ఆవిష్కరణ అని చెప్పవచ్చు ఈ ఆయింట్‌మెంట్ శక్తివంతమైన రక్షణ పొరగా నిలవడంతో పాటు కరోనాను ఎదుర్కోవడంలో ముందువరసలో నిలుస్తుంది.
ఎవరి సహాయం లేకుండానే ఈ ఆయింట్‌మెంట్ ను వినియోగించవచ్చని ఫార్మా కంపెనీ తెలిపింది. కరోనా వైరస్ తో పాటు ఇన్ ఫ్లూయెంజా వైరస్ లపై ఈ ఆయింట్‌మెంట్ అద్భుతంగా పని చేస్తోంది. ఈ ఆయింట్‌మెంట్ సెకన్ల వ్యవధిలోనే కరోనా వైరస్ విస్తరించే సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తోంది. ఈ ఆయింట్‌మెంట్ ను ముక్కులోకి పీల్చుకోవడం ద్వారా వైరస్ సంక్రమణను అడ్డుకోవచ్చని, ఫంగస్, బ్యాక్టీరియాల నుంచి రక్షణ కోసం కూడా ఈ ఆయింట్‌మెంట్ ను వినియోగించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనాకు ఔషధాలు, ఆయింట్మెంట్లు అందుబాటులోకి వస్తూ ఉండటంతో వైరస్ ను కట్టడి చేయడం త్వరలోనే సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి