ఏపీ రాష్ట్రంలో రాజకీయాలు మరియు ప్రభుత్వ పరిస్థితులు రోజు రోజుకి కీలకంగా మారుతున్నాయి.ఇప్పుడే ప్రభుత్వం తీసుకున్న ప్రతి చట్టంలో తప్పులను వెతుకుతూ ప్రతిపక్ష పార్టీలు కోర్ట్ లో కేసులు వేస్తుంటే, ఇప్పుడు ఏకంగా ఏపీ ప్రభుత్వ ప్రజా విధానాల సలహాదారుగా ఉన్న రామచంద్రమూర్తి తన పదవికి  రాజీనామా చేయడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధిక ప్రాధాన్యతను సంతరించుకోవడం జరిగింది. రాజీనామా చేసి లేఖను ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లంకు సమర్పించారు. కాగా రామచంద్ర మూర్తి సీనియర్ జర్నలిస్ట్ గా పలు పత్రికల్లో ఎడిటర్ గా పనిచేసి అనుభవం ఉన్న వ్యక్తి. అంతకుముందు సాక్షి పత్రికలో కూడా ఎడిటోరియల్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించి ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనను జగన్ ప్రత్యేకంగా  గుర్తించి ఈ అధికారాన్ని ఇవ్వడం జరిగింది.




అయితే రామచంద్రమూర్తి తాను వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో వివరించడం జరిగింది. కారణాలు ఏమైనప్పటికీ ఖాళీగా ఉంటూ జీతాలు తీసుకోవడం ఇష్టంలేకనే రాజీనామా చేసినట్లుగా పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. జగన్ ప్రభుత్వంలో ఇప్పటికే 33 మంది సలహాదారులున్నారు. ఏదో వారు వైసీపీ కోసం పాటుపడ్డారని వారందరినీ జగన్ ప్రభత్వ సలహాదారు పోస్టుల్లో సర్దుబాటు చేశారనే ప్రచారం ఉంది. ఆయన ప్రస్తుతం జగన్ కొలువులో సలహాదారుగా ఉన్నారు.అయినా ఆయనకు సలహాలు ఇవ్వలేకపోవడం...కొని సలహాలు ఇచ్చినా ఆయన దగ్గరకు పోలేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయిన రామచంద్రమూర్తి జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోవడంతో రాజీనామా చేసారని మరికొందరు అంటున్నారు.  




జగన్ సీఎం అయ్యాక ప్రజలకు సంక్షేమ పధకాలు నవరత్నాలు మరియు అధికారులతోపనులు చేయించుకోవడానికి, ఢిల్లీ లో రాజకీయాలు, రాజధాని పై ఎత్తుకు పై ఎత్తులు వేయడం, మీడియావిషయాలు వీటన్నిటికీ  సమయం సరిపోయిందని, ఇక ఏ బిజీ లో ఆయన మంత్రులకే టైం ఇవ్వడం లేదు. ఇక పనిలేని ఉత్సవ విగ్రహాలుగా  ప్రభుత్వ సలహాదారులను పట్టించుకునే సమయం ఎక్కడిదని అపవాదు లేకపోలేదు. జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో  గొంతులో నాలుకలాగా అడ్డు పడుతూ వస్తున్న ప్రతి పక్షానికి మరియు సొంత పార్టీలోని కొంతమంది ప్రభుత్వ అసంతృప్తులు ఇది చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పాలి. ఇది ఏపీ ప్రభుత్వానికి ఊహించని ట్విస్ట్  అనే చెప్పాలి.  మరి దీనిపై  జగన్ ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: