ప్రస్తుతం శరవేగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో చాలా మంది ప్రజలు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలి అంటేనే భయపడిపోతున్నారు. దీంతో చాలా మటుకు ఎప్పుడూ రద్దీగా ఉండే రహదారు లన్నీ ప్రస్తుతం కాస్త నిర్మానుష్యం గానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యం లోనే రోడ్ల పైకి వస్తున్న వాహనదారులు అతివేగం తో వెళుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. మద్యం ఏకంగా  నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇప్పటికే ఎంతోమంది తాగిన మత్తు లో డ్రైవింగ్ చేసి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.



 ఇక్కడ ఓ యువకుడు ఇదే రీతిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. బైక్ పై దూసుకెళ్లి విద్యుత్ స్తంభానికి ఢీకొని  మృతి చెందాడు.  ఈ విషాదకర హైదరాబాద్ నగరం లో చోటు చేసుకుంది. మియాపూర్ లో నివసిస్తున్న మణితేజ అనే వ్యక్తి ఓ ప్రైవేటు సంస్థ లో పని చేస్తున్నాడు. ఇక గురువారం అర్ధరాత్రి సమయంలో నానక్ రామ్ గూడలో ఉన్న మై హోమ్ అవతార్ లో ఉంటున్న స్నేహితులకు వద్దకు వెళ్ళాడు. స్నేహితులు అందరూ కలిసి ఫుల్లుగా మందు పార్టీ చేసుకున్నారు. అప్పటికే  ఫుల్లుగా మద్యం తాగిన మణితేజ.. తెల్లవారుజాము సమయంలోనే బైక్ పై  ఇంటికి బయలుదేరాడు.



 అప్పటికే కరోనా  సమయం రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి... దీంతో బైక్ ని మరింత వేగంగా డ్రైవ్ చేసాడు. ఈ క్రమంలోనే రామానాయుడు స్టూడియో గేటు దగ్గర బైక్  అదుపుతప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో  తీవ్ర గాయాలపాలయ్యాడు, అక్కడే ఉన్న స్థానికులు గమనించి అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మణితేజ ప్రాణాలు వదిలాడు.  దీంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది. ఇక  మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: