ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో వెలుగులోకి వచ్చింది. మైలాపూర్ లోని లాలా ఎస్టేట్ ప్రాంతంలో పళని అనే వ్యక్తి ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. మొదటి భార్య చనిపోవడంతో మరియల్ అనే మహిళ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. ఆటో డ్రైవర్ గా పని చేసే పళని పొద్దున సమయంలో వెళ్లి ఎప్పుడో రాత్రి సమయంలో వచ్చే వాడు. ఈ క్రమంలోనే ఒంటరిగా ఉన్న భార్య అదే ప్రాంతానికి చెందిన పళని సోదరుడు సెంథిల్ తో వివాహేతర సంబంధానికి తెరలేపింది.
ఇక అన్న కు తెలియకుండా ఎన్నో రోజుల పాటు వీరి రాసలీలలు కొనసాగుతూ వచ్చాయి. ఇక సుమారు గత ఏడాది నుంచి వీరి మధ్య అఫైర్ కొనసాగుతూ వచ్చింది. కానీ ఇటీవలే వీరి వివాహేతర సంబంధం గురించి కుటుంబ సభ్యులకు తెలియడంతో... ఇద్దరిని మందలించి తీరు మార్చుకోవాలి అంటూ హెచ్చరించారు. కొద్దిరోజుల పాటు వారిద్దరూ సవ్యంగానే ఉన్నప్పటికీ తిరిగి మరోసారి వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఇక ఓ రోజు మద్యం మత్తులో ఇంటికి వచ్చిన భర్తకు భార్య తమ్ముడితో నగ్నంగా ఉండడం చూసి కోపంతో రగిలిపోయాడు.
పక్కనే ఉన్న ఇనుప రాడ్ తో ఇద్దరిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఇక ఈ దాడిలో పళని తమ్ముడు సెంథిల్ తలపై బలంగా గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అసలు విషయం చెప్పి నిందితుడు పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి