వామ్మో ఈ డాక్టర్ అందర్నీ నిజంగా డాక్టర్ అని నమ్మించాడు. కానీ చివరికి శిక్ష అనుభవిస్తున్నాడు. అసలేం జరిగింది...? పూర్తి వివరాల్లోకి వెళితే.... ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు మండలం బొడ్డువారిపాలెం గ్రామానికి చెందిన వెంకట్‌రావు కుమారుడు తేజ అలియాస్‌ తేజారెడ్డి అలియాస్‌ అవినాష్‌ రెడ్డి అలియాస్‌ వీరగంధం తేజ(23) బాలాజీ హిల్స్‌లో నివాసం ఉంటున్నాడు. కేవలం ఐదవ తరగతి వరకు మాత్రమే చదివిన ఇతను తేజ పేరుతో నకిలీ గుర్తింపు కార్డులను సంపాదించాడు. అంతే కాకుండా టెన్త్, ఇంటర్‌ ఉత్తీర్ణత పాత్రలతో పాటు భారతీయ శిక్షా పరిషత్‌ లక్నో, ఉత్తర్‌ప్రదేశ్‌ పండిత్‌ దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ్‌ మెమోరియల్‌ హెల్త్, ఆయూష్‌ యూనివర్సిటీ తో పాటు పలు యూనివర్సిటీల నుంచి తేజ ఎంబీబీఎస్, బీబీఏ, ఎంబీఏ నకిలీ ధృవపత్రాలను కూడా పొందడం జరిగింది.

ఈ నకిలీ పత్రాలతో మొదట బెంగుళూరులోని సప్తగిరి ఆస్పత్రిలో జూనియర్‌ డీఎంవోగా పని చేశాడు. ఆ తర్వాత మరెంత తెలివిగా ఏఎస్పీ దేవగిరి అంటూ కొన్ని పోలీస్‌స్టేషన్‌లలో తనిఖీలు కూడా చెయ్యడం జరిగింది. హద్దు అదుపు లేకుండా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఎం.ఎన్‌.రెడ్డి కుమారుడునని పోలీసులని కూడా మోసం చేసాడు. కానీ పోలీసులు విచారణ చేయడంతో నిజం బయటపడింది. ఆ తర్వాత జైల్లో పెట్టడం జరిగింది. జైలు నుండి బయటకి వచ్చాక హైదరాబాద్ నగరంలోని అనేక కార్పొరేట్‌ ఆస్పత్రులలో వైద్యుడిగా పని చేసాడు.

వైద్యుడిగా ఫిబ్రవరి వరకు వైద్య శిబిరాలను కూడా ప్రారంభం చేసాడు. కరోనా బారినపడిన పోలీసులకి సైతం వైద్యం చేశాడు. ఇలా పోలీసు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలను పెట్టుకున్నాడు. గుంటూరుకి చెందిన ఒక ఆమెని వివాహం చేసుకున్నాడు. ఆమెకి విడాకులు ఇవ్వకుండానే డెంటిస్ట్ ని వివాహం చేసుకున్నాడు. దీనికి తోడు రౌడీషీటర్‌కు చెందిన వాహనానికి ప్రభుత్వ వాహనం అని స్టిక్కర్‌ వేయించుకున్నాడు. పోలీసులకు ఆనుమానమొచ్చి పరిశీలిస్తే అంతా బయటపడింది. తీగ లాగితే డొంక కదిలినట్టు అనేక మోసాలు బయటపడ్డాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: