అయితే ఇటీవలే మరో సారి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజనికా అందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. మళ్ళీ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మొదలు పెట్టినట్లు చెప్పుకొచ్చింది. బ్రిటిష్ రెగ్యులేటర్ నుంచి అన్ని రకాల అనుమతులు రావడంతో... మళ్ళీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినట్లు చెప్పింది. అయితే బుధవారం తమ క్లినికల్ ట్రయల్స్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆస్ట్రా జనికా ప్రకటించగా... ఇక భద్రతా ప్రమాణాలను సమీక్షించేందుకు ఒక కమిటీ ఏర్పాటై దర్యాప్తు జరిపి... చివరికి క్లినికల్ ట్రయల్స్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఆస్ట్రా జనికా క్లినికల్ ట్రయల్స్ మళ్లీ ప్రారంభమయ్యాయి.
అయితే బ్రిటన్ లో క్లినికల్ ట్రయల్స్ మొదలైన నేపథ్యంలో భారత్ లోను ఈ క్లినికల్ ట్రయల్స్ కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే మూడు వందల కోట్ల డోసులను ప్రపంచ దేశాలకు అందించడానికి ఆస్ట్రా జనిక సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆస్ట్రా జనిక వ్యాక్సిన్ మళ్ళీ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించిన నేపథ్యంలో అందరిలో మరింత ధైర్యం పెరిగి పోయింది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి