మరికొంతమంది కరోనా వైరస్ బారిన పడ్డారు అని తెలియగానే మనస్థాపం చెంది చివరికి బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువై పోతున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. కరోనా వైరస్ ఏకంగా ఆ వృద్ధున్ని మానసికంగా చంపేసింది... దీంతో చివరికి వృద్ధుడు ఆత్మహత్య చేసుకొని మరణించిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ నగరంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... జబల్పూర్ నగరానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు కి గత నెల 20వ తేదీన కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది.
దీంతో ఆ వృద్ధుడు హోమ్ క్వారంటైన్ లోనే ఉన్నాడు. ఇక 14 రోజుల తర్వాత మరోసారి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా మరో సారి పాజిటివ్ అని తేలింది. దీంతో ఆవేదన చెందిన వృద్ధుడు చివరికి ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక జూస్ ఇచ్చేందుకు వచ్చిన మనవడు అది చూసి ఒక్క సారిగా షాక్ అయ్యాడు. దీంతో బంధువులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్నారు. ఇక దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కరోనా నిబంధనల ప్రకారమే ఆత్మహత్య చేసుకున్న సదరు వృద్ధుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి