వ్యవసాయ అభివృద్ధికి చేయూత అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న  విషయం తెలిసిందే. ఇటీవలే వ్యవసాయ బిల్లు ద్వారా రైతులు పండించిన పంటను దేశంలో ఎక్కడైనా గిట్టుబాటు ధర ఉన్నచోట అమ్ముకునేందుకు అవకాశం కల్పించింది. అంతేకాకుండా రైతులు పండించిన పండుకు వ్యాపారులు సరైన సమయంలో డబ్బులు చెల్లించకపోతే జరిమానాలు విధించేందుకు కూడా ప్రతిపాదనలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవలే ప్రభుత్వం అన్నదాతలకు తీపికబురు అందించేందుకు సిద్ధమవుతోంది అనే టాక్ వినిపిస్తోంది. మరికొన్ని రోజుల్లో చెరుకు పండించే రైతులు అందరికీ చేయూత కలిగించే విధంగా కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.




 పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇటీవల కేంద్రం ముందు ఒక కీలక ప్రతిపాదనలు ఉంచింది. ఇథనాల్  ధరలు పెంచాలి అంటూ సూచించింది. దాదాపుగా ఇథనాల్  ధరను లీటరుకు మూడు రూపాయల మేర పెంచాలని కోరిన పెట్రోలియం మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేబినెట్కు పంపినట్లు తెలుస్తోంది. దీనిపై అటు కేంద్ర కేబినెట్ కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆమోదం పొందగానే 2020 డిసెంబర్ 1 నాటికి ఇథనాల్ ధర  పెంపు నిర్ణయం అమలులోకి వచ్చే అవకాశమున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.



 ఇక ప్రస్తుతం ఇతను ధర 43 రూపాయల నుంచి 59 రూపాయల మధ్య ఉంది. పెట్రోల్ లో కలపడానికి.. వాహనాలకు ఉపయోగించే ఒక రకమైన ఇత్తనాల ఆల్కహాల్ ను  చెరుకు పంట నుంచి తయారు చేస్తారు అనే విషయం తెలిసిందే. అందుకే ప్రస్తుతం ఇథనాల్  ధర పెంచితే చెరుకు  రైతులందరికీ ఎంతో మేలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా పడడంతో దేశవ్యాప్తంగా చెరుకు పంట భారీగా వేసినట్లు తెలుస్తోంది దీంతో ఈ ఏడాది ఇథనాల్ ఉత్పత్తి మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఏదేమైనా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకోబోతున్న నిర్ణయం మాత్రం చెరుకు రైతులందరికీ ఎంతో మేలు చేకూర్చే విధంగా ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: