సాధారణంగా రాజకీయ నేతలకు కార్యకర్తలకు అభిమానులు ఉండటం సహజం. వారి మనస్తత్వం నచ్చిన లేక వారి చేసే కార్యకలాపాలు ప్రజల కోసం వారు చేసే సంక్షేమ పథకాలను మెచ్చి చాలా మంది ప్రజలు వారికి అభిమానులుగా మారిపోతున్నారు.. ఉదాహరణకు వై యస్ రాజశేఖర్ రెడ్డి కి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన ప్రజలకు చేసిన సేవలకు ప్రజలు ఆయనను మహానేత గా గుండెల్లో పెట్టుకున్నారు.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ను కూడా తమిలీలు ఎక్కువగా అభిమానించే వారు.అమ్మ అని ఇప్పటికీ ఆమె పై అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక ఇప్పుడు మోదీ కి కూడా అభిమానులు చాలా మంది ఉన్నారు.



ఇది ఇలా ఉండగా తెలంగాణ రాజకీయ నాయకులకు కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. కేటీఆర్ ఉద్యోగుల కోసం చేసే ప్రయత్నాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తెలంగాణ మాజీ ఎంపీ కవితకు కూడా అభిమానులు ఎక్కువే.. అంతేకాక, బతుకమ్మ పండుగకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారి పోయారు. మరోవైపు, సోషల్‌ మీడియాలో కూడా చురుగ్గా ఉంటూ ఎంతోమంది అభిమానులను చూరగొన్నారు. తాము అభిమానించే కవితక్క కోసం అభిమానులు ఏం చేయడానికైనా సిద్దంగా ఉన్నారు.



ఈ మేరకు నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోల గ్రామానికి చెందిన సొసైటీ చైర్మన్‌.. కల్వకుంట్ల కవితకు పెద్ద అభిమాని. మగ్గారి హన్మాండ్లు అనే ఈయన కవిత బొమ్మను ఏడు గ్రాముల బంగారంతో చేయించుకొని మెడలో లాకెట్‌ రూపంలో వేసుకున్నాడు. ఈసారి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత క్క గెలుస్తుందని, ముందుగానే ఆమె కోసం ఈ లాకెట్ చేయించుకున్నానని హన్మాండ్లు ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం లాకెట్ చేయించుకోవడమే కాదు గతంలో కూడా కవిత పేరును చేతి పై పచ్చాబొట్టు వేయించుకున్నాడు.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. అతని అభిమానాన్ని మెచ్చుకుంటూ నెటిజన్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: