మహిళలపై రోజురోజుకు లైంగిక వేధింపులు ఎక్కువతూనే ఉన్న విషయం తెలిసిందే. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎక్కడ ఎవ్వరిలో  మాత్రం మార్పు రావడంలేదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలకు పాల్పడడం... వేధింపులకు దిగడం దాడులు చేయడం లాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వచ్చి సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్న విషయం తెలిసిందే. ఉన్నత స్థానంలో కొనసాగుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ బాధ్యతగా వ్యవహరించాల్సిన ఉన్నతాధికారులే కొన్నిసార్లు నీచ బుద్ది తో కిందిస్థాయి ఉద్యోగుల పట్ల ప్రవర్తిస్తున్న తీరు... దారుణంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే.




 ఈ క్రమంలోనే ఎంతోమంది పైఅధికారులకు ఎదురు చెప్పలేక కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగం నుంచి తప్పుకో లేక పున్నామ నరకం లోనే ఎన్నో వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇలా మహిళలు వేధింపులకు గురవుతున్న ఘటనలు రోజురోజుకు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇలా వేధింపులకు గురవుతున్న ఎంతోమంది మహిళలు చివరికి కఠిన నిర్ణయం తీసుకుని బలవన్మరణానికి పాల్పడే  పరిస్థితులు కూడా దాపురుస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది.



 తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నతాధికారి వేధింపులు తాళలేక ఏఎన్ఎం ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది సృష్టించింది. కాకినాడ రూరల్ తూరంగి  సచివాలయంలో పూర్ణిమ అనే యువతి ఏఎన్ఎం గా విధులు నిర్వహిస్తోంది. గత కొద్దిరోజుల నుంచి ఆమెను మెడికల్ ఆఫీసర్ వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టాడు. ఇక ఇటీవలే తన పైఅధికారి మెడికల్ ఆఫీసర్ వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ ఆరోపిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్న పూర్ణిమ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను బంధువులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: