సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే ఏ రేంజిలో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే స్టార్ హీరోల సినిమాలు భారీ విజయాలు సాధించలేక పోయినప్పటికీ ఆవరేజ్ టాక్ సొంతం చేసుకున్న నిర్మాతలకు మాత్రం కష్టాలు తక్కువే  అని చెప్పాలి. ఎందుకంటే యావరేజ్  టాక్ సొంతం చేసుకున్నప్పటికీ స్టార్ హీరోల సినిమాలు మామూలుగా ఆడుతూనే ఉంటాయి. విజయం సాధించింది అంటే నిర్మాతలు అందరికీ లాభాల పంట పండుతుంది అని చెప్పాలి. అయితే స్టార్ హీరోల సినిమాలకు ఎక్కువగా డిమాండ్ ఉండేది కేవలం సినిమా థియేటర్లలో మాత్రమే కాదు బుల్లితెరపై కూడా స్టార్ హీరోల సినిమాలకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది.



 అందుకే వివిధ ఛానళ్లు  ప్రత్యేకమైన రోజులలో ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలను.. మంచి విజయాలు సాధించిన సినిమాలు టెలికాస్ట్ చేస్తూ ఉంటాయి అనే విషయం తెలిసిందే. తద్వారా మంచి రేటింగ్ను సొంతం చేసుకుంటాయి. అంతేకాదు  స్టార్ హీరోల సినిమాలను టెలికాస్ట్ చేసే రెండు మూడు రోజుల ముందు నుంచే ప్రేక్షకులందరినీ ఆకర్షించే విధంగా ఎన్నో ప్రోమోలను  కూడా వేస్తూ  ఉంటాయి టీవీ ఛానళ్లు. ఇలా స్టార్ హీరోల సినిమాలకు బుల్లితెరపై కూడా భారీ డిమాండ్ ఉంటుంది. ప్రేక్షకులు కూడా బుల్లితెరపై స్టార్ హీరోల సినిమాలను చూసేందుకు ఆసక్తి చెబుతుండడంతో చానళ్ళకి టాప్ రేటింగ్ లు వస్తూ ఉంటాయి.




 అయితే గతంలో టాప్ చానల్ గా కొనసాగిన జెమినీ టీవీ కి ఇలా ఓ స్టార్ హీరో సినిమా ద్వారా  మంచి రేటింగ్ చాన్నాళ్ల తర్వాత సొంతం చేసుకుంది. గతంలో ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టి టాప్ ఛానల్ గా  కొనసాగిన జెమినీ టీవీ ప్రస్తుతం రేటింగ్ పడిపోయి  ప్రస్తుతం వరుసగా నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అలాంటి ఛానల్ ఇటీవలే మహేష్ సినిమా టెలికాస్ట్ చేయడంతో టాప్ రేటింగ్ సొంతం చేసుకుంది. ఇటీవలే సరిలేరు నీకెవ్వరు సినిమా నాలుగు సార్లు టెలికాస్ట్ చేసింది జెమిని టివి. దీంతో దేశంలోని టాప్ 30 ప్రోగ్రామ్స్ లోకి సరిలేరు నీకెవ్వరు రేటింగ్స్ చేరాయి. దీంతో మహేష్ బాబు జెమినీ టీవీ లైవ్ ఇచ్చినట్లు విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: