ప్రస్తుతం భారత దేశాన్ని మొత్తం కరోనా  వైరస్ అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు రికార్డుస్థాయిలో కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక కరోనా వైరస్ ప్రభావం కలిగిన దేశాలలో రెండవ స్థానంలో కొనసాగుతుంది భారత్. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో ప్రజలందరూ ఆందోళన చెందుతున్నప్పటికీ.. రికవరీ రేటు కూడా బాగుండడం అందరిలో  కాస్త ధైర్యం నింపుతుంది. ఇక ప్రజలందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్  ఏదోవిధంగా పంజా విసురుతున్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే దేశ ప్రజానీకం మొత్తం ప్రస్తుతం వ్యాక్సిన్లు ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే భారత్ లో పలు రకాల ఫార్మా సంస్థలు వ్యాక్సిన్  అభివృద్ధి చేసి ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న దశలో ఉన్న విషయం తెలిసిందే. అయితే వ్యాక్సిన్  అందుబాటులోకి వచ్చిన తర్వాత వ్యాక్సిన్ ధర ఎంత ఉంటుంది అని అందరూ ఆలోచనలో పడ్డారు. అయితే ఇటీవలే బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్  ఉచితంగా ఇస్తానంటూ బిజెపి ప్రకటించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. కేవలం దేశంలో బీహార్ రాష్ట్రం ఒకటే ఉందా అంటూ ప్రతిపక్షాలన్ని ప్రశ్నించడం మొదలు పెట్టాయి.



 ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించినట్లు  తెలుస్తుంది. ఈ క్రమంలోనే కేవలం బీహార్ రాష్ట్రంలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కరోనా వైరస్ టీకా ఉచితంగా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశ ప్రజలందరికీ కూడా ఉచితంగానే కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీ చేస్తాము అంటూ ఇటీవల కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇప్పటికే దీనిపై ప్రకటన చేశారు అంటూ చెప్పుకొచ్చారు. వ్యాక్సిన్  పంపిణీకి 500 రూపాయల వరకు కేంద్రానికి ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నామని ప్రస్తుతం దేశంలో వివిధ రకాల వ్యాక్సిన్లు అభివృద్ధి చెంది  క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి అంటూ కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: