సాధారణం గా అబ్బాయిలు గా పుట్టిన వారు ఎంతో మంది జన్యు లోపాల కారణంగా అమ్మాయిలు గా మారిపోవడం మనం చూస్తూనే ఉన్నాం ఈ రోజుల్లో. కానీ అమ్మాయిలు అబ్బాయిలు గా మారి పోవడం అనేది చాలా తక్కువగా చూస్తూ ఉంటాం.  మామూలుగా ఇలాంటి ఘటనలు ఎక్కువ గా సినిమా లో జరుగుతూ ఉంటాయి అనే విషయం తెలిసిందే. ఎన్నోసార్లు సినిమాల్లో కొన్ని పాత్రలు ఇలా అమ్మాయిల నుంచి అబ్బాయి గా మారుతూ ఉంటారు. కానీ నిజ జీవితం లో ఇలాంటి ఘటనలు మాత్రం చాలా తక్కువగా నే జరుగుతాయి అనడం లో అతిశయోక్తి లేదు.



 ఇక్కడ ఇద్దరు అక్క  చెల్లెలు ఇదే చేశారు... ఇద్దరు అక్కా చెల్లెళ్లు లింగ మార్పిడి చేసుకుని  అబ్బాయిలు గా మారి పోయారు ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తం గా సంచలనం గా మారిపోయింది. అయితే ఇద్దరు అక్కా చెల్లెళ్లు అబ్బాయిగా లింగ మార్పిడి చేయించుకొని పూర్తిగా అబ్బాయిల లాగా మారడానికి వెనుక పెద్ద కారణమే ఉంది అన్నది అర్ధమవుతుంది. ఈ ఆసక్తికర ఘటన పాకిస్థాన్లో చోటు చేసుకుంది. పాకిస్తాన్ లో ఒక ఉన్నత కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఏకంగా లింగ మార్పిడి చేసుకుని అబ్బాయిలాగా మారిపోవడం సంచలనంగా మారింది.


 ఏటిపికల్ జెనీటిలియా అనే సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇద్దరు అక్క చెల్లెలు. అయితే వీరి వయసు పెరుగుతుంది కానీ జననేంద్రియాలు మాత్రం సరిగ్గా రూపుదిద్దుకోవడం లేదు. దీంతో వీరి తల్లిదండ్రులు ఎంతగానో ఆందోళన చెందారు. ఇక చిన్నప్పుడు నుంచి దాదాపుగా చాలా ఏళ్ల వరకు అమ్మాయిలు గానే పెరిగారు. కానీ వయస్సు వచ్చినప్పటికీ ఋతుస్రావం కాకపోవడం తో తల్లిదండ్రులు.. ఇద్దరు అక్కాచెల్లెళ్లు కూడా ఆందోళన చెందారు. దీంతో లింగమార్పిడి చేసుకునేందుకు  ప్రసిద్ధమైన ఇద్దరు అక్కాచెల్లెళ్లు... అబ్బాయిలు గా మారిపోయారు అంతేకాదు వీరి పేర్లను కూడా మార్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: