మామూలుగా భారతదేశంలో కోడిపందాలు వివిధ ప్రాంతాలలో జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే కోడిపందాలపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి నప్పటికీ ఏదో ఒక విధంగా ప్రజలు మాత్రం కోడి పందాలు నిర్వహిస్తూనే ఉంటారు అన్న  విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అయితే కోడిపందాలు ఎంత ఫేమస్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఎంతో మంది కోడి పందాలు నిర్వహిస్తూనే ఉంటారు. ఈ కోడిపందాలలో లక్షలు  చేతులు మారుతూ ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు.



 ఇక ఈ కోడి పందాల కోసం అప్పటికప్పుడు కాకుండా ఎన్నో రోజుల నుంచి కోళ్లను సిద్ధం చేస్తూ ఉంటారు ఎంతో మంది పోటీదారులు. కోడి పందాల కోసం సిద్ధం చేసే కోళ్ళకి జీడిపప్పు లాంటి ఎన్నో పౌష్టిక ఆహారం పెడుతూ పెడుతూ ఉంటారు. ఇక కోడి పందాలు సమయంలో సాధారణంగా పోటీలో పాల్గొనే కోళ్ల కాళ్ళకి కోడి కత్తి కట్టి పోటీలకు దించుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇదంతా ఎంతో రసవత్తరంగా సాగుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఇటీవలే ఏకంగా ఓ పందెంకోడి పోలీస్ అధికారి ప్రాణాలు తీసింది. ఏంటి ఆశ్చర్య పోయారు కదా.



 పందెంకోడి పోలీస్ అధికారి ప్రాణాలు తీయడం ఏంటి అని అంటారా  కానీ ఇక్కడ నిజంగా అదే జరిగింది. ఉత్తర సమర్  ప్రాంతంలో కోడిపందాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే స్థానిక మున్సిపల్ పోలీస్ ఆఫీసర్ గా పని చేస్తున్న క్రిస్టియన్ జూలోక్  సిబ్బంది అక్కడ కోడి పందాలను అడ్డుకునేందుకు వెళ్లారు.  ఇక అప్పటికే అక్కడ కోడిపందాలు జరుగుతుండగా కోడి పందాల్లో  హోరాహోరీ గా పోటీ పడుతున్న ఒక కోడి పుంజును  పట్టుకునేందుకు పోలీస్ అధికారి ప్రయత్నించాడు. ఇక పోలీస్ అధికారి చేతిలో నుంచి కోడిపుంజు ఎగిరి పోవడానికి ప్రయత్నించగా ఈ క్రమంలోనే కోడిపుంజు కాలికి కట్టిన కోడి కత్తి ఏకంగా పోలీసు అధికారి రక్తనాళాన్ని  కోసింది.  దీంతో పోలీసు అధికారి చివరికి ప్రాణాలు కోల్పోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: