ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ముంబై ఇండియన్స్ జట్టు పూర్తి ఆధిపత్యం సాధించి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై ఘన విజయాన్ని సాధించింది. ఇక నేడు మరో కీలక మ్యాచ్ జరగబోతోందన్న విషయం తెలిసిందే. సన్రైజర్స్ హైదరాబాద్... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నేడు మ్యాచ్ జరగబోతోంది ఈ మ్యాచ్ ఇరు జట్లకు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. దాదాపు రెండువేల పదహారు తర్వాత ప్రే ఆఫ్ కి చేరుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారి టైటిల్ గెలవడానికి ఎంతో కసిగా ఉంది. 2016లో టైటిల్ గెలిచినట్లుగా ఈసారి కూడా టైటిల్ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది సన్రైజర్స్ హైదరాబాద్ .
దీంతో నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ లో ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకి ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతోంది. కాగా ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఆతర్వాత.. క్వాలిఫైయర్ మ్యాచ్లో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. దీంతో నేడు జరగబోయే మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధిస్తుంది అన్నది ప్రస్తుతం ప్రేక్షకులు అందరిలో తీవ్రస్థాయిలో ఉత్కంఠ నెలకొంది. దీంతో ఇక ఈ రోజు సాయంత్రం జరగబోయే మ్యాచ్ కోసం ప్రేక్షకులు అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి