టిడిపి ఎప్పుడు విరుచుకు పడేందుకు సిద్ధంగా  ఉండే మంత్రి కొడాలి నాని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం పేదలకు మేలు చేయాలని విధంగా ప్రయత్నాలు చేస్తుంటే , తెలుగుదేశం దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. గుడివాడ నియోజకవర్గంలో ప్రజల కోసం నేడు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజలతో మమేకం అవుతూ ప్రజాసక్షేమ పథకాల అమలు తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు 5 ఏళ్ల పరిపాలనలో రెండు లక్షల ఇళ్లు కూడా ఇవ్వలేకపోయారు అని, కానీ వైసీపీ ప్రభుత్వం 30 లక్షల ఇళ్లు కట్టిస్తామని అంటే మాత్రం, దానిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 



పేదలకోసం ఇల్లు స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తుంటే,  కోర్టులకు వెళ్లి స్టే తీసుకువచ్చి వాటిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. నా ఇల్లు నా సొంతం పేరుతో తెలుగుదేశం పార్టీ నేతలు నిరసనలు చేయడంపై నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన టిడిపి నాయకులు అంతా ఇప్పుడు రోడ్లు ఎట్టి హడావుడి చేస్తున్నారంటూ నాని మండిపడ్డారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు. చంద్రబాబు దమ్ముంటే గుడివాడ వచ్చి ఒక ఇల్లు అయినా ఇచ్చి చూపించగలవా అంటూ సవాల్ చేశారు. టిడిపి నాయకులు చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా, 2024 లోపు గుడివాడలో 25 వేల మంది లబ్ధిదారులకు ఇల్లు కట్టించి తీరుతామని నాని సవాల్ చేశారు.



గుడివాడ నియోజకవర్గంలో 25 వేల మంది పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టించి కోర్టులు అంగీకరిస్తే రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తామని చెప్పుకొచ్చారు. అలా కుదరని పక్షంలో పట్టాలు అయినా ఇస్తామని , 2024 ఎన్నికలలోపు ఇచ్చే బాధ్యత జగన్, మాది అని నాని అన్నారు   ఒకవేళ వాటిని అడ్డుకునేందుకు చంద్రబాబు వంటి వారు ప్రయత్నిస్తే జగన్నాథ రథచక్రాల కింద నల్లుల్లా, నడిపిస్తాం అంటూ  నాని మండిపడ్డారు.2024 లోపు 25 వేల ఇళ్లు ఇవ్వకపోతే నేను ఓట్లు అడగడానికి రానని, అసలు పోటీ కూడా చెయ్యను అంటూ  నాని ప్రతిజ్ఞ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: