ప్రజలు మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని తెర మీదకి వస్తున్న దొంగబాబాలు ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రజలందరికీ సమస్యల పేరుతో మాయమాటలు చెప్పి పూజల పేరుతో డబ్బులు దండుకుంటున్నారు ఎంతోమంది. అంతేకాదు కొంతమంది దొంగబాబాలు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా ఎన్నో తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. ఇక రోజు రోజుకు ఇలా దొంగ బాబాలు మాంత్రికుల బెడద ఎక్కువ అవుతూ ఉంది. పోలీసులు ఇలాంటి దొంగ బాబాలను నమ్మకూడదు అని ఎన్నిసార్లు అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రజల తీరులో మాత్రం మార్పు రావడం లేదు.
ఇక్కడ ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏకంగా మాంత్రికుడు చెప్పాడు అన్న కారణంతో కన్న కూతురునే కిరాతకంగా నరికేశాడు ఇక్కడ కసాయి తండ్రి. ఈ దారుణ ఘటన ఝార్ఖండ్ లో చోటుచేసుకుంది. లోహార్దాగా జిల్లాకు చెందిన సుమన్ అనే వ్యక్తి రోజు వారి కూలీ గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతనికి పెళ్ళై ఆరేళ్ల కూతురు ఉంది తర్వాత కాన్పులో కొడుకు పుట్టాలని కోరికతో మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాడు. అయితే కూతురిని బలి ఇస్తే తప్పక కొడుకు పుడతాడని మాంత్రికుడు చెప్పడంతో చివరికి సుమన్ మాంత్రికుడు చెప్పినట్లుగా తన ఆరేళ్ల కూతురు ని దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి నిందితున్ని అరెస్టు చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి