దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం తమ బ్యాంకు కస్టమర్లు  అందరికీ ఎన్నో అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తు ఎంతోమంది కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఈ మధ్యకాలంలో లోన్ ల పై వడ్డీ రేట్లను తగ్గిస్తూ కస్టమర్లు  అందరికీ ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దారిలోనే నడుస్తుంది దిగ్గజ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ బజాజ్ ఫైనాన్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీతిలోనే తమ కస్టమర్లకు  కూడా లోన్ ల పై తక్కువ వడ్డీ ని విధించేందుకు సిద్ధమైంది. దీంతో ప్రస్తుతం రుణాలపై తక్కువ వడ్డీ నిర్ణయంతో కస్టమర్లకు ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.



 ఇటీవలే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అందిస్తున్న హోమ్ లోన్స్ పై వడ్డీ రేట్లను ఎక్కువ మొత్తంలో తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది బజాజ్ ఫైనాన్స్. దీంతో ఎంతోమంది బజాజ్ ఫైనాన్స్ ద్వారా హోమ్ లోన్స్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు బజాజ్ లో కూడా హోమ్ లోన్స్ పై  వడ్డీ రేట్లు 6.9 శాతం నుంచి మాత్రమే ప్రారంభమవుతాయి. ఇక సొంతింటి కలను సాకారం చేసుకోవాలనే ఎంతోమందికి ప్రస్తుతం బజాజ్ ఫైనాన్స్ అందిస్తున్న తక్కువ వడ్డీకే హోమ్  లోన్స్ సదుపాయం గొప్ప శుభవార్త అని చెప్పవచ్చు.



 దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇదే తరహా వడ్డీరేట్లు హోమ్ లోన్స్ పై విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సొంతింటి కలను సాకారం చేసుకోవాలి అనుకుంటున్నా ఎంతోమంది ప్రస్తుతం హోమ్ లోన్స్ పై బజాజ్ ఫైనాన్స్ అందిస్తున్న ఆఫర్లు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఇక అతి తక్కువ వడ్డీ రేట్లకి హోమ్ లోన్స్ అందిస్తుండటంతో... ఇది కస్టమర్లకు ఎంతో ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే బజాజ్ ఫైనాన్స్ తమ కస్టమర్లకు ఎన్నోరకాల లోన్స్ కూడా అందిస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: