జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా మారిపోయిన విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో సీన్ రిపీట్ కాకుండా ఉండేందుకు అటు అధికార పార్టీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. అదే సమయంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో సీన్ రిపీట్ అయ్యేలా చేసేందుకు అటు బిజెపి కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రతిపక్ష అధికార పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు పర్వం కొనసాగుతోంది. ఎవరికి వారు ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక జిహెచ్ఎంసి ఎన్నికల్లో తప్పక వంద సీట్లు గెలిచి తీరుతాను అంటూ అటు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు అన్న విషయం తెలిసిందే.




 ఈసారి జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రజలు అందరూ తెలంగాణ ప్రభుత్వం పై నమ్మకం కోల్పోయారని ఇక బీజేపీదే జిహెచ్ఎంసి మేయర్ పీఠం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఈ క్రమంలోనే అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. అధికార పార్టీ తీరును ఎండగడుతూ.. అధికార పార్టీ ఇచ్చి నెరవేర్చని హామీలను గుర్తుచేస్తూ ప్రస్తుతం ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది బిజెపి. అదే సమయంలో హైదరాబాద్ నగరంలో వరద సహాయం విషయంలో జరిగిన అవకతవకలపై కూడా బిజెపి గత కొన్ని రోజుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.



 తాజాగా మరోసారి ఇదే విషయంపై మాట్లాడిన తెలంగాణ బీజేపీ కీలక నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కెసిఆర్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. వరద సాయంపై టిఆర్ఎస్ నేతలు దోపిడీకి పాల్పడ్డారు అంటూ ఆరోపించారు. ఓల్డ్ సిటీలో ఎం ఐ ఎం.. న్యూ సిటీ లో టిఆర్ఎస్ వరద సాయం దోచుకున్నారు అంటూ మండిపడ్డారు కిషన్ రెడ్డి. అధికార పార్టీ నేతల ఆగడాలకు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉంది అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు ఇటీవలే బోరబండ లో నిర్వహించిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు బిజెపిని గెలిపించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: