రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు.. ఏ పార్టీ ఎప్పుడు కలుస్తాయి, ఎప్పుడు విడిపోతాయో, ఎప్పుడు విమర్శలు చేసుకుంటాయి, ఎప్పుడు పొగడ్తలు చేసుకుంటాయి చెప్పలేం.. ఈరోజు తిట్టుకున్నా ఇద్దరు నేతలు రేపు ఒకే పార్టీ లో కండువాలు కప్పుకుంటూ ఉంటారు. ఈరోజు కలిసి ప్రచారం చేసిన నేతలు రేపు వేర్వేరు పార్టీ లో ఉండి విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఈ తరహా రాజకీయం ఏపీ లో ఎక్కువ చూస్తుంటాం.. ఎందుకంటే అక్కడ రాజకీయ నాయకులు పార్టీ లు మారడం ఎక్కువ కాబట్టి..

ఇదిలా ఉంటే తిరుపతి త్వరలో ఉపఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఇక్కడ టీడీపీ అభ్యర్థి ని కూడా ప్రకటించేసింది.. గత ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయినా పనబాక లక్ష్మి  ఇక్కడ పోటీ చేస్తుండగా వైసీపీ, బీజేపీ పార్టీ అభ్యర్థుల వేటలో ఉన్నారు. ఇప్పటికే కొంతమంది పేర్లు కన్ఫార్మ్ అయినా పేరులో అధికారికంగా ప్రకటించ లేదు. అన్ని పార్టీ లు ఇక్కడ గెలుపు ధీమా ను వ్యక్తం చేస్తుండగా బీజేపీ అయితే కాస్త దూకుడుగా ఆల్రెడీ గెలిచేశాం అని చెప్పడం వింతగా ఉంది. అయితే వైసీపీ సంగతి పక్కన పెడితే బీజేపీ తో పొత్తులో ఉన్న జనసేన ఇక్కడ పోటీ చేస్తుందా అనేది ఆసక్తి కరంగా మారింది.

జ‌న‌సేన ఎంట్రీ 2014కు ముందు జ‌రిగింది.  ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన‌ క‌లిసి ఇక్కడ పోటీ చేశాయి. టీడీపీ తిరుప‌తి టికెట్‌ను బీజేపీకి వ‌దిలేసింది. దీంతో బీజేపీ త‌ర‌ఫున కారుమంచి జ‌య‌రామ్ ఇక్క‌డ నుంచి బ‌రిలో నిలిచారు.  ఆయన 5,42,951 ఓట్ల‌తో రెండో స్థానంలో నిలిచారు. ఒంట‌రిగా బ‌రిలోకి దిగిన‌.. వైసీపీ గెలుపు గుర్రం ఎక్కింది. మొన్నటి ఎన్నికల్లో  బొమ్మి శ్రీహ‌రిరావు.. పోటీ చేసి కేవలం 16,125 ఓట్లు సాధించి.. డిపాజిట్ ద‌క్కించుకోలేక అభాసుపాల‌య్యారు.జనసేన అయితే పోటీకి దిగలేదు.. సో ఎటు చూసిన ఇక్కడ బీజేపీ కే కొంత బలం ఉందన్నది వాస్తవం..

మరింత సమాచారం తెలుసుకోండి: