ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిన్న జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ జరిగింది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది ఈ క్రమంలోనే ఎంతో మంది పోలింగ్ సిబ్బంది ఈ పోలింగ్ నిర్వహణలో పాల్గొన్నారు. కానీ గ్రేటర్ ఓటర్లు మాత్రం పోలింగ్ జరుగుతున్నప్పటికీ ఓట్లు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు సరైన నాయకున్ని ఎన్నుకోవటంలో నిర్లక్ష్యం వహించారు గ్రేటర్ ఓటర్లు. ఉదయం సమయంలో ఇక పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు లేకపోవడంతో ఇక మధ్యాహ్న సమయంలో వస్తారులే... అనుకున్నారు అందరు. ఇక మధ్యాహ్నం సమయం కూడా ఓటర్లు తక్కువగానే రావడం పోలింగ్ మందకొడిగా నే జరిగింది.
ఈ క్రమంలోనే అందరూ పనులు ముగించుకుని సాయంత్రం సమయంలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు లే అని అనుకున్నారు... ఇక సాయంత్రం కావస్తున్నా అదే తీరు కొనసాగడంతో ఇక ఓటర్లు రారు అని ఫిక్స్ అయ్యారు అందరు. అడుగుల దూరంలో పోలింగ్ కేంద్రాలు ఉన్నప్పటికీ గడపదాటి కూడా ఒక్క అడుగు కూడా వేయలేదు గ్రేటర్ ఓటర్. గ్రేటర్ లో అతి తక్కువ పోలింగ్ శాతం నమోదు కావడంతో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వస్తున్నాయి. పోలింగ్ ఉన్నప్పటికీ నగరం నిద్ర లేవ లేదని చలికాలం కాబోలు అంటూ ప్రస్తుతం ఎంతో మంది సెటైర్లు వేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి