వ్యవసాయ చట్టంలోని మూడు అంశాలను సవరించేందుకు సిద్ధంగా ఉన్నామని చూచాయగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అయితే మద్దతు ధర విషయంలో హామీ ఇవ్వడం సాధ్యం కాదని చెబుతోంది. రైతుల డిమాండ్లకు కేంద్రం సూచిస్తున్న పరిష్కారాలకు ఎక్కడా పొంతన కనిపించడం లేదు. ఆదివారం మరోసారి రైతు సంఘాల నాయకులతో కేంద్రం చర్చలు జరపనుంది.

ఢిల్లీలో రైతుల ఆందోళన మరింత తీవ్రం అవుతోంది. రైతుల ఆందోళనలతో ఢిల్లీ వాసులకు చుక్కలు కనిపిస్తున్నాయి. అన్నదాతలు ఢిల్లీ సరిహద్దుల్లో హైవేలన్నింటినీ దిగ్బంధించారు సింఘు, టిక్రి, లాంపూర్‌, సబోలి, సఫియాబాద్‌ సరిహద్దులను పోలీసులు మూసివేశారు. 44వ జాతీయరహదారికి రెండువైపులా రాకపోకలను నిషేధించారు. ఝతికరా సరిహద్దులో కేవలం ద్విచక్రవాహనాలనే అనుమతిస్తున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని దిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు. అయితే ప్రత్యామ్నాయ మార్గాలతో దూరం పెరగడమేగాక, రద్దీ కూడా విపరీతంగా ఉంటుండటంతో గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది.

ఢిల్లీలో కోవిడ్  విజృంభిస్తూ ఉండటంతో రైతుల్ని తక్షణమే నగరం నుంచి ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై కోర్టు ఇంకా విచారణ చేపట్టలేదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు ప్రకటించారు. రైతుల భూమిని లాక్కోవాలనే ప్రయత్నాలకు వ్యతిరేకంగా తృణమూల్ పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అన్నదాతల ఆందోళన కేంద్ర ప్రభుత్వాన్ని మోకాళ్ల మీద నిల్చునేలా చేసిందన్నారు మెహబూబా ముఫ్తీ. రైతుల ఆందోళనలకు వివిధ రాష్ట్రాల నుంచి సంఘాల నుంచి మద్దతు పెరుగుతోంది.

రైతుల ఆందోళనకు అనేక సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. కొంతమంది రచయితలు ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను  వెనక్కి ఇచ్చేస్తున్నారు. నిన్నటి చర్చల్లో చట్టాల్లోని అన్ని అంశాలపై ప్రభుత్వం పూర్తి సమాచారంతో వివరణ ఇచ్చింది. అయితే కేంద్రం వివరణను రైతు నాయకులు తిరస్కరించారు. చట్టాల్లో చాలా లొసుగులు, లోపాలు ఉన్నాయని రైతులు తమ వాదన వినిపించారు. అయితే ఈ అంశంపై నిర్ణయం తేలకపోవడంతో ఆదివారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: