వృద్ధాప్యంలో తమను చేరదీసి బాగా చూసుకుంటాడు అని ఆ తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కొడుకు ఏకంగా తల్లిదండ్రుల పాలిట యమకింకరుడు గా మారిపోయాడు. తల్లిదండ్రులను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన కుమారుడే తల్లిదండ్రులపై దారుణంగా దాడికి పాల్పడ్డాడు. ఎంతో అల్లారుముద్దుగా పెంచిన కొడితే తమను చిత్రహింసలకు గురి చేస్తూ దాడికి పాల్పడడంతో బరువెక్కిన హృదయంతో ఆ తల్లిదండ్రులు బాధపడుతున్న తీరు అందరిని కంటతడి పెట్టించింది.
కని పెంచిన తల్లిదండ్రులను బాగోగులు చూడకుండా ఏకంగా దారుణంగా కుమారుడు తల్లిదండ్రుల పై దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లా నాగాయలంక మండలం లో చోటుచేసుకుంది. వీర రాఘవయ్య అనే వ్యక్తి తన తల్లిదండ్రుల పై గొడ్డలి కర్రతో దాడి చేశాడు. ఇక వృద్ధులైన తల్లిదండ్రులను ఎటు తప్పించుకోలేని దీన స్థితిలో ఉండటంతో తీవ్ర గాయాలపాలయ్యారు. ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి నాగేశ్వరరావు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులుతీవ్ర గాయాలపాలైన నాగేశ్వరరావును ఆసుపత్రికి తరలించారు. తన భార్యతో గొడవలు కారణంగానే వీరరాఘవయ్య తల్లిదండ్రుల పై దాడి చేశాడని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి