ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ నేతలు వేల కోట్లు దోచుకున్నారని విమర్శలు చేశారు. భూముల కొనుగోళ్లలో తీవ్ర అక్రమాలకు పాల్పడ్డారని మాట్లాడుతూ వస్తున్నారు. అలాగే వ్యక్తిగతంగా పలువురు ఎమ్మెల్యేలని టార్గెట్ చేసి టీడీపీ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌పై టీడీపీ నేతలు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.
మైలవరంలో వసంత, ఆయన అనుచరులు ఇళ్ల పట్టాల్లో కోట్లు దోచుకున్నారని విమర్శలు చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా, వసంత టార్గెట్‌గా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇక టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వసంత కూడా గట్టిగానే స్పందించారు. దేవినేని ఉమాతో టీడీపీ అనుకూల మీడియాపై ఫైర్ అయ్యారు. తాను గానీ, తన అనుచరులుగానీ మైలవరంలో ఒక్క రూపాయి అవినీతి జరిగినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అయితే ఈ సవాల్‌కు వెంటనే దేవినేని ఉమా స్పందించారు.
పురగుట్టలో టీడీపీ ఇచ్చిన పట్టాలను రద్దు చేసే అధికారం ప్రశ్నించిన ఉమా...చంద్రబాబు హయాంలో ఏర్పడిన లే అవుట్‌కు సిగ్గు శరం లేకుండా వైసీపీ పేర్లు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. అయ్యప్ప మాలలో ఉండి ఎమ్మెల్యే వసంత అసత్యాలు, అబద్దాలు మాట్లాడుతున్నారని, మైలవరంలో వసంత కొండలని సైతం తవ్వేశారని, ఇళ్ల పట్టాల్లో తీవ్ర అవినీతికి పాల్పడ్డారని, తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని, అవినీతి చేస్తే రాజీనామా చేస్తానన్నావుగా చెయ్ అని దేవినేని సవాల్ విసిరారు. అయితే వసంత మాత్రం ఎలాంటి అవినీతి చేయలేదని అంటున్నారు. మరి ఎవరి ఆరోపణల్లో నిజం ఉందో భవిష్యత్‌లో తెలుస్తుందేమో.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి