మునుపెన్నడూ లేని విధంగా పాకిస్తాన్ కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి అనే విషయం తెలిసిందే.  ఓవైపు పాకిస్తాన్ భారత్ సరిహద్దులో తోక జాడించి పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడటంతో ఇక ఎదురుదాడికి దిగిన భారత్ ఏకంగా పాకిస్థాన్ సరిహద్దుల్లో ఐదు కిలోమీటర్ల వరకు దూసుకుపోయి  పాకిస్తాన్ సైనికులు ఉగ్రవాదులను తరిమితరిమి కొడుతూ ఎదురుదాడి చేయడంతో అప్పటికే పాకిస్తాన్ కి  కోలుకోలేని దెబ్బ తగిలింది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం భారత్ కొట్టిన దెబ్బ కంటే అంతకుమించి అనే రేంజ్ లో బెలూచ్ ఆర్మీ పాకిస్తాన్ ని వరసగా దెబ్బలు కొడుతూ ఉంది.



 ఇటీవలే బలూచిస్తాన్ ఆర్మీ పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టింది. చైనా కు తొత్తు గా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ తీరుపై తీవ్రస్థాయిలో తిరుగుబాటు చేస్తున్న బెలూచ్ ఆర్మీ.. ఇప్పటికే 25 మందితో వెళ్తున్నా హెలికాప్టర్ ను ధ్వంసం చేసింది అనే విషయం తెలిసిందే. దీంతో 25 మంది చనిపోయారు. ఇక ఆ తర్వాత ఆ 25 మందిని కాపాడేందుకు వచ్చిన మరో ఏడుగురిని కూడా బెలూచ్  ఆర్మీ దాడి చేసినట్టు మట్టు బెట్టింది. ఇప్పుడు తాజాగా మరో సారి దాడిచేసి వణికించింది బెలూన్ ఆర్మీ. ఇప్పటికే బెలూచ్ ఆర్మీ దాడిలో చనిపోయినటువంటి వారి కోసం వెళ్లినటువంటి మరికొంత మంది సైనికులను కూడా దాడి చేసి దారుణంగా కాల్చేసింది.



 ఏకంగా ఈ దాడిలో 12 మంది సైనికులు చనిపోగా ఇందులో ఇద్దరు ఆఫీసర్లు కూడా ఉండడం గమనార్హం.  ఇలా కనీసం ఊపిరి పీల్చుకో లేని విధంగా పాకిస్తాన్ ను  వరుసగా దెబ్బలు కొడుతూనే ఉంది బెలూచ్ ఆర్మీ. దీంతో బెలూచ్ ఆర్మీ  ని ఎలా కంట్రోల్ చేయాలి అన్నది  కూడా తెలియక ప్రస్తుతం పాకిస్థాన్ ప్రభుత్వం తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఇప్పటికీ పాకిస్తాన్ ప్రజల నుంచి స్థాయిలో వ్యతిరేకత వచ్చి ఉద్యమాలు చేస్తున్న తరుణంలో ఇక ఇప్పుడు బెలూన్ ఆర్మీ వరుసగా దాడులకు పాల్పడడం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని  అయోమయంలో పడేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: