అటు పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి సైబర్ నేరగాళ్ల పై ఉక్కుపాదం మోపి అరెస్టులు చేసినప్పటికీ సైబర్ నేరగాళ్ల తీరు మాత్రం ఎక్కడా మారడం లేదు. రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ఏదో ఒక విధంగా నేరాలకు పాల్పడడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో తమకు ఉన్న తెలివిని మంచి పనుల కోసం కాకుండా ప్రజలను బురిడీ కొట్టించడం కోసం ఉపయోగిస్తూ జనాల్ని బురిడీ కొట్టించి భారీగా డబ్బులు దండుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు.
రోజు రోజుకి ఇలాంటి తరహా ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు వివిధ కారణాలతో బ్లాక్ అయ్యాయి అంటూ కస్టమర్లకు ఫోన్ చేస్తారు.. ఇక తమ మాయమాటలతో వారు చెప్పింది నిజమే అని నమ్మేలా మాట్లాడుతారు... ఇక వారిని మాటల్లో పెట్టి చివరికి ఖాతా మొత్తం ఖాళీ చేస్తారు. అందుకే ఎవరైనా ఫోన్ చేసి ఓటిపి చెప్పాలని కోరినప్పుడు అస్సలు చెప్పవద్దని కుదిరితే పోలీసులకు సమాచారం అందించాలి అంటూ సూచిస్తున్నారు పోలీసు అధికారులు. అంతేకాకుండా ఏటీఎం కార్డు మీద ఉన్న సీవీవి నెంబర్ కూడా ఎవరికీ చెప్పవద్దు అంటూ సూచిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి