ఈ మధ్య కాలంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఏదో ఒక విధంగా జనాలకు గాలం వేయడం ఇక మాయ మాటలతో నమ్మించి భారీగా డబ్బులు దండుకోవడం లాంటివి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది ప్రకాశం జిల్లాలో.  ప్రకాశం జిల్లా కొండెపి మండలం లోని పలువురు యువతకు ఆన్లైన్ మోసగాళ్లు గాలం వేసి..  భారీగా డబ్బులు దండుకున్నారు. ఒక రోజు రెండు రోజులు కాదు దాదాపుగా ఎనిమిది నెలల పాటువారి ఆటలు సాగించారు సైబర్ నేరగాళ్లు.


 ఈ క్రమంలోనే యువతను నమ్మించి డబ్బులు డిపాజిట్ చేసుకొని ఇక భారీగా డబ్బులు పోగైన తర్వాత వారికి కుచ్చు టోపీ పెట్టారు. ఈ ఘటన ఇటీవలే వెలుగులోకి రావడంతో సంచలనంగా మారిపోయింది. పెద్ద కండ్లకుంట గ్రామానికి చెందిన యువకులు తమ గ్రామంలో ఇతర ప్రాంతాల్లో యువకుల ద్వారా బర్స్  యాప్ గురించి తెలుసుకుని డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ లో 30 మందికి పైగా యువకులు ఆకర్షితులయ్యారు. అయితే ఈ యాప్ లో 600 రూపాయల నుంచి 30 వేలు  వరకు 50 వేల వరకు డిపాజిట్ చేయాలి అంటూ పలు సూచనలు రావడంతో అలాగే చేశారు. ఇక రెండు రూపాయల వరకు కమిషన్ బ్యాంకులో జమ అవుతుంది అంటూ ఆకర్షితులను చేయడంతో యువకులు నమ్మారు.



 ఇక ఆ తర్వాత మోసపోయామని గ్రహించారు  కాని బయటకు చెప్పుకుంటే సిగ్గు చేటని మిన్నకుండిపోయారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఇలా మోసపోయానని గ్రహించి పోలీసులనుఆశ్రయించారు. కాగా  వీరు  ఏకంగా 1.5 కోట్ల వరకు నష్టపోయినట్లు పోలీసులు అంచనా వేశారు.  దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికే కొంతమంది యువకులు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇంకా ఎంతోమంది యువకులు యాప్  ద్వారా మోసపోయిన ముందుకు రావడం లేదని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: