ఇక ఇటీవలే మహేష్ యాదవ్ అనే వ్యక్తి అనారోగ్యానికి గురై మరణించిన సందర్భంగా స్నేహితులకు బ్యాంకులో దాచిపెట్టిన డబ్బుల గురించి చెప్పాడు.. ఇక తన దగ్గర డబ్బులు లేనప్పుడు బ్యాంకులో ఉన్న డబ్బులతో వైద్యం చేయించుకుంటాను అంటూ స్నేహితులతో చెబుతూ ఉండేవాడు. కాని అంతలోనే మహేష్ యాదవ్ ప్రాణాలు కోల్పోయాడు. ఎవరూ లేకపోవడంతో గ్రామస్తులు అంత్యక్రియలు జరిపేందుకు ముందుకు వచ్చారు. ఇక బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుతో ఘనంగా అంత్యక్రియలు జరపాలని అనుకున్నారు.
ఈక్రమంలోనే బ్యాంకుకు వెళ్లి మహేష్ చనిపోయాడని అతను దాచుకున్న డబ్బులతో అంత్యక్రియలు నిర్వహిస్తామని బ్యాంకు సిబ్బందిని అడిగారు. కానీ డబ్బులు ఇచ్చేందుకు మాత్రం సిబ్బంది అంగీకరించలేదు. అంతే కాదు అతనికి నామిని కూడా ఎవరూ లేరని.. అతను స్వయంగా వస్తేనే డబ్బులు తీసుకోవడానికి అర్హుడు అంటూ బ్యాంకు మేనేజర్ తెగేసి చెప్పాడు. దీంతో ఏం చేయాలో అర్థంకాని గ్రామస్తులు ఇక చేసేదేమీ లేక మహేష్ యాదవ్ భవాని బ్యాంకు కి తీసుకెళ్లారు. ఇప్పుడైనా డబ్బులు ఇస్తారా అంటూ బ్యాంక్ మేనేజర్ ని అడగగా ఒక్కసారిగా షాక్ అయ్యాడు మేనేజర్. వెంటనే అతను దాచుకున్న డబ్బులను గ్రామస్తులకు ఇవ్వడంతో అతని అంత్యక్రియలు నిర్వహించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి