అసలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది జగన్ ప్రభుత్వమా.. నిమ్మగడ్డ ప్రభుత్వమా అన్నట్లు నిమ్మగడ్డ జోరు ఓ రేంజ్ లో ఉంది.. తనను ఎవరు అపరని అనుకున్నాడో ఏమో స్థానిక ఎన్నికలు ఎంత వద్దంటున్న వినకుండా ఇటీవలే ఎన్నికల షెడ్యూల్ ని రిలీజ్ చేసి అందరిలో ఆసక్తిని రేకెత్తించాడు. ప్రభుత్వాన్ని కాదని నిమ్మగడ్డ చేసిన ఈ ధైర్యాన్ని మెచ్చుకున్నా కోర్టు మాత్రం మంచి బుద్ధి చెప్పింది. ఈ దెబ్బతో ఇప్పుడు ఆయనకు ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి..
కోర్టు బుద్ధి చెప్పినా కూడా తన వైఖరిని మాత్రం మార్చుకోకపోవడం ఆయన వ్యవహార శైలి ఏమిటో తెలుపుతోంది. హైకోర్టు తీర్పుపై డివిజనల్ బెంచ్‌లో సవాల్ చేస్తామని నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం ఆయన లక్ష్యాలను చెప్పకనే చెబుతోంది. మరో రెండు నెలల్లో ఉద్యోగ విరమణ చేస్తున్న నిమ్మగడ్డ.. ఇప్పటికైనా తీరు మార్చుకుంటే శేషజీవితం ప్రశాంతంగా గడపొచ్చు. ఏపీ హైకోర్టు ఆదేశాలతో చేసిన పొరపాట్లను దిద్దుకునే అవకాశం ఆయనకు లభించింది. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని.. ప్రజా స్వామ్యానికి, ప్రజలకు జరిగిన నష్టానికి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయడం ద్వారా.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు తాను మొదలు పెట్టిన వివాదానికి తానే ముగింపు పలికాననే సంతృపై్తనా దక్కుతుందని చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి