ఈ మధ్య అధికార వైసీపీ, బీజేపీని బాగా హైలైట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ, టీడీపీని తోక్కేసి ఆ స్థానంలోకి రావాలని చూస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఒక్క శాతం ఓట్లు కూడా రాకపోయినా, వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నిస్తుంది. ఇక ఈ ప్రయత్నాలకు అధికార వైసీపీ కూడా సపోర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఆ పార్టీకి కూడా టీడీపీ వీక్ అవ్వడమే కావాలి కాబట్టి, బీజేపీని ఎంకరేజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా మంత్రి కొడాలి నాని లాంటి వారైతే నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీలకు వచ్చే ఓట్ల శాతంలో పెద్ద తేడా ఉండదని మాట్లాడుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన 40 శాతం ఓట్లలో బీజేపీ 20 శాతం వరకు చీలుస్తుందని జోస్యం చెబుతున్నారు. అలాగే తిరుపతి ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తే కనీసం పోటీ ఇవ్వలేదని, బీజేపీ అయితే  కాస్తో కూస్తో పోటీ ఇస్తుందని నాని లాంటి వారు మాట్లాడుతున్నారు.

అంతే బీజేపీని హైలైట్ చేస్తే అది టీడీపీకే నష్టమనే విధంగా అధికార వైసీపీ ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే తిరుపతి పార్లమెంట్ బరిలో బీజేపీనే పోటీలో ఉండాలనే విధంగా చెబుతున్నారు. అయితే పోటీలో ఎవరున్న తిరుపతి సీటు వైసీపీదే. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ టీడీపీ ఓడిపోయినా సరే, ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటే పరిస్తితి వేరుగా ఉంటుంది.

ఒకవేళ ఇక్కడ జనసేన పోటీలో ఉంటే, కాస్త ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటుంది. పైగా తిరుపతి పార్లమెంట్ పరిధిలో కాపు ఓట్లు ఎక్కువ ఉన్నాయి. జనసేనకు ఎక్కువ ఓట్లు పడితే, వైసీపీ మెజారిటీ తగ్గుతుంది. అదే పొత్తులో భాగంగా బీజేపీ బరిలో ఉంటే, అక్కడ ఉండే కాపు ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశముంది. బీజేపీకి ఓటు వేసిన ఉపయోగం లేదనుకుని వైసీపీకి వేస్తారు. దీంతో అధికార వైసీపీకి మెజారిటీ పెరుగుతుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీకి నష్టం జరుగుతుందని అంటున్నారు. అందుకే వైసీపీ, పోటీలో బీజేపీ ఉంటేనే బెటర్ అనే ఆలోచనలో ఉందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: