ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ మళ్ళీ కోలుకోవాలంటే త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నిక గెలవడం తప్పనిసరి అయ్యింది.. ఇక్కడ గెలవకపోతే వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం తప్పకుండా పడుతుంది. ఇప్పటికే ప్రజల్లో వీక్ అయిపోయి టీడీపీ ఆల్మోస్ట్ పతనం అయ్యే స్థాయికి వెళ్ళిపోయింది. దీని నుంచి బయటపడి బలమైన వైసీపీ ని ఎదుర్కోవాలంటే తిరుపతి లో గెలుపు చాలా కీలకం. పైగా చంద్రబాబు సొంత జిల్లా కావడంతో  ఇది అయన పరువు సమస్య కూడా అయ్యింది. జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత ఉందని నిరుపించాలన్నా, తమపై ఇంకా ప్రజలకు నమ్మకం పోలేదని చూపించుకోవలన్నా ఈ ఉప ఎన్నిక అన్నిటికి వేదిక కానుంది..

అందుకు తగ్గట్లే చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలకు దీనిపై దిశా నిర్దేశం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉప ఎన్నికలో విజయం సాధించాలని , ఎవరు కూడా నిర్లక్యంగా వ్యవహరించవద్దని, కేసులకు భయపడవద్దని నియోజకవర్గ టీడీపీ నేతలకు భరోసా ఇచ్చారు. ఈమేరకు తిరుపతి లో కార్యాచరణ ను కూడా ప్రకటించారు. ఈ నెల 17వ తేదీ నుంచి తిరుపతి ఉప ఎన్నికల ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రారంభించనున్నారు. సంక్రాంతి పండగ అనంతరం ఇక నేతలందరూ జనంలోనే ఉండాలని చంద్రబాబు ఆదేశించారు.

ఈ ఉప ఎన్నిక తో వైసీపీ కి బుద్ధి చెప్పాలనే సంకేతాలు ఇప్పటికే చంద్రబాబు నేతల్లోకి పంపగా, ఇక్కడి గెలుపు కు కృషి చేయాలనీ కొందరి నేతలకు బాధ్యతలు కూడా అప్పజెప్పారు. ఇక్కడ ఎన్నికల ప్రచారం కోసం దాదాపు 70 మంది సీనియర్ నేతలను ఉపయోగించుకోనున్నారట చంద్రబాబు. ఈ నెల17వ తేదీన తిరుపతిలో పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి పది రోజుల పాటు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించాలని చంద్రబాబు ఆదేశించారు. మొత్తం మీద తిరుపతి ఉప ఎన్నికను ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో చంద్రబాబు ముందస్తు ప్రచారానికి దిగనున్నారన్న మాట..

మరింత సమాచారం తెలుసుకోండి: