మాజీ మంత్రి అఖిల ప్రియ పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయారా.. ఆయన ఇప్పట్లో జైలు నుంచి  బయటకు వచ్చే అవకాశాలు లేవా.. రాజకీయ కుటుంబం అయి ఉండీ.. మాజీ మంత్రి అయి ఉండీ.. ఆమె జైల్లో గడపాల్సిందేనా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే.. ఆమె చేయించిన నేరం తీవ్రత అంతగా ఉందని తెలుస్తోంది. సాధారణంగా రాజకీయ నాయకులు జైళ్లకు వెళ్లినా.. వెంటనే బెయిల్ పై బయటకు వస్తుంటారు. ఎందుకంటే.. వాటిలో చాలా వరకూ వైట్ కాలర్ నేరాలుగానే ఉంటాయి.

కానీ అఖిల ప్రియ విషయం అలా కాదు.. ఆమె చేసింది అక్షరాలా బిగ్ క్రైమ్..  వ్యక్తుల‌ను కిడ్నాప్ చేయించారు.. చాలా ప్రీ ప్లాన్డ్ గా ఏకంగా 20 మందిని ఉప‌యోగించారు.. పెద్ద కిడ్నాప్ డ్రామాను న‌డిపించార‌ు.. అందుకే ఈ వ్యవ‌హారంలో ప‌లు సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు. పోలీసులు ప‌క్కాగా ఆధారాలు సేక‌రించారు. ఇప్పటికే కిడ్నాపింగ్ లో పాల్గొన్న నిందితులను ప‌ట్టుకున్నారు. ఈ కేసులో అఖిల ప్రియ పూర్తిగా ఇరుక్కున్నట్టుగా ఉన్నార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అందుకే ఈ కేసులో అఖిల ప్రియకు బెయిల్ దొరకడం లేదు. బెయిల్ కోసం ఆమె న్యాయవాదులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. కోర్టులు అంగీకరించడం లేదు. సికింద్రాబాద్ కోర్టులో అఖిల‌ప్రియ త‌ర‌ఫున దాఖ‌లైన బెయిల్ పిటిష‌న్ విచార‌ణ సంద‌ర్భంగా ఆస‌క్తిదాయ‌క‌మైన వ్యాఖ్యలు  చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ కేసులో అఖిల‌ప్రియ‌కు బెయిల్ ఇవ్వడం త‌మ ప‌రిధిలోని అంశం కాద‌ని కోర్టు చెప్పిందట.

అఖిల‌ప్రియ‌పై న‌మోదు అయిన సెక్షన్‌లు, అభియోగాలు తీవ్రమైన‌వన్నమాట. ఈ కేసులో యావ‌జ్జీవ శిక్ష ప‌డే కారాణాలున్న చేత బెయిల్ కోసం నాంప‌ల్లి కోర్టునే ఆశ్రయించాల‌ని సికింద్రాబాద్ కోర్టు స్పష్టం చేసిందట. మరి కోర్టు అంత సీరియస్ గా కామెంట్ చేసిందంటే అఖిల ప్రియ పూర్తిగా ఇరుక్కున్నట్టే అంటున్నారు విశ్లేషకులు. మరి అఖిల ప్రియ ఈ కేసు నుంచి బయటపడతారా..?

మరింత సమాచారం తెలుసుకోండి: