ద‌క్షిణాది రాష్ట్రాల‌ను దేవ (భూములు) రాష్ట్రాలుగా భావిస్తారు. ద‌క్షిణ కైలాసంగా పేర్కొనే శ్రీకాళ‌హ‌స్థి, ద‌క్షిణ కాశీగా, శ‌క్తి పీఠాల్లో ఒక‌టిగా పేర్కొనే ద్రాక్షారామం ఏపీలోనే ఉన్నాయి. ఇక‌, జ‌గ‌జ్జ‌న‌ని దుర్గ‌మ్మ‌కు ఏపీ నిల‌యం. మ‌రోవైపు క‌లియుగ వైకుంఠం తిరుమ‌ల ఉన్న ఏకైక రాష్ట్రం కూడా మ‌న‌దే! ఇక‌, పొరుగు రాష్ట్రాల‌ను ప‌రిశీలిస్తే.. బాస‌ర‌, యాదాద్రి వంటి ప్ర‌ముఖ క్షేత్రాల‌తో తెలంగాణ‌, మ‌ధుర‌, కంచి కామాక్షి, అరుణాచ‌లం వంటి మోక్ష‌పురుల‌తో త‌మిళ‌నాడు భాసిల్లుతున్నాయి. ఆయా ఆల‌యాలు ఉన్నాయంటే.. వాటిలో నిత్యం ధూప‌దీప నైవేద్యాలు చేస్తున్న‌ది బ్రాహ్మ‌ణులే. ఎంత టెక్నాల‌జీ పెరిగిపోయినా.. నేటికీ .. తెల్ల‌వారుజామ‌ను.. ఆల‌యాల్లోకి ప్ర‌వేశించి లోక శాంతి కోసం పూజ‌లు చేసేది.. ప్ర‌భుత్వాలు, పాల‌కులు చ‌ల్ల‌గా ఉండాల‌ని కోరుకునేది బ్రాహ్మ‌ణులే.

ఇవి పేరొందిన ఆల‌యాలు కాగా.. ల‌క్ష‌ల సంఖ్య‌లో మ‌ధ్య‌, చిన్న ఆల‌యాలు కూడా రాష్ట్రాల్లో ఉన్నాయి. వీటిలోనూ నిత్యం పూజాదికాలు చేసేది బ్రాహ్మ‌ణులే. వీరు నిత్యం సంధ్యావందనం చేసుకుని తిన్నా తిన‌క‌పోయినా.. దేవ‌దేవుల సేవ‌లో కైంక‌ర్యాలు చేస్తూ.. రాష్ట్ర‌, దేశ ర‌క్ష‌ణ‌కుధార్మిక మార్గంలో కృషి చేస్తున్నారు. మ‌రి ఆ బ్రాహ్మ‌ణులు ఈ రాష్ట్ర జ‌నాభాలోనే ఉన్నారు క‌దా! వారికి కూడా కుటుంబాలు, పిల్ల‌లు, చ‌దువుల‌, ఆర్థిక స‌మ‌స్య‌లు, రుణాలు, ఉపాధి వంటివి అవ‌స‌రం క‌దా! కొన్ని బ్రాహ్మ‌ణ కుటుంబాలు నేటికీ.. చాలా గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో సైతం.. భ‌క్తులు ఇచ్చే ప‌దో ప‌ర‌కో ఆదాయంతోనే జీవ‌నాన్ని వెళ్ల‌దీస్తున్నాయి.

వీరికి ప్ర‌భుత్వాల నుంచి ఏ ఒక్క ప‌థ‌కం వారికి అమ‌లు కావ‌డం లేదు. పొరుగు రాష్ట్రాల‌ను చూస్తే..  పాల‌కులు బ్రాహ్మ‌ణుల ప‌ట్ల ఎంతో విన‌యంగా.. విధేయంగా క‌నిపిస్తున్న ప‌రిస్థితి ఉంది. ఏ కార్య‌క్ర‌మం జ‌రిగినా.. ఇతోధిక సాయం అందిస్తున్నారు. బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట వేస్తున్నారు. పాదాభి న‌మ‌స్కారాలు చేస్తున్నారు.కానీ, మ‌న రాష్ట్రంలో మాత్రం సీఎం జ‌గ‌న్ ఎప్పుడూ.. ఎక్క‌డా ఏ కార్య‌క్ర‌మం జ‌రిగినా.. చివ‌ర‌కు త‌న జ‌న్మ‌దినం రోజు.. తిరుమ‌ల నుంచి క‌ష్ట‌ప‌డి వ‌చ్చి.. ఆశీర్వ‌దించిన పురోహితుల‌కు కూడా వంగి న‌మస్కారం చేసేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు.

ఇదేనా బ్రాహ్మ‌ణుల ప‌ట్ల పాల‌కులు అవ‌లంబించాల్సిన విధానం అన్న సందేహాలు కొన్ని వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇటీవ‌ల క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆల‌యాలు మూత‌బ‌డిన‌ప్పుడు తెలంగాణ‌,త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క ప్ర‌భుత్వాలు.. బ్రాహ్మ‌ణుల‌కు ప్ర‌త్యేకంగా.. పూజారుల‌కు నెల‌నెల రూ.10 వేలు ఇచ్చి ఆదుకున్నాయి. కానీ, ఆ స్ఫూర్తి మ‌న ద‌గ్గ‌ర ఎక్క‌డా క‌నిపించ‌లేదు. దీంతో ఇదేనా జ‌గ‌న్ పాల‌న‌.. ? అని ప్ర‌శ్నిస్తున్నారు బ్రాహ్మ‌ణులు. దీనికి పాల‌కులు ఏం స‌మాధానం చెబుతారో చూడాలి. 

బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి
తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.

మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!

మరింత సమాచారం తెలుసుకోండి: